Breaking News

యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు.. వ్యక్తి సజీవదహనం

Published on Wed, 01/15/2025 - 07:24

లక్నో/హైదరాబాద్‌: తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయలుదేరింది. కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. ఇక, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. దీంతో, అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)