Breaking News

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

Published on Wed, 10/18/2023 - 18:52

కోల్‌కతా: ఇటీవల కాలంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చదవు ఒత్తిడి, మానసిక సమస్యలు, ఇతరాత్ర కారణాలతో భవిష్యత్తును చేజేతులారా తుంచేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు చెందిన కే కిరణ్‌ చంద్ర అనే విద్యార్థి ఐఐటీ ఖగర్‌పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

బహదూర్‌ శాస్త్రీ హాస్టల్‌లో ఉంటున్న చంద్ర మంగళవారం రాత్రి గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం ఓప్రకటనలో వెల్లడించింది. కిరణ్‌ మృతితో సహచర విద్యార్థులు, ఐఐటీ అధ్యాపకులు, సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతికి గరైనట్లు తెలిపింది. అతడి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. 

‘మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చంద్ర తన రూమ్‌మెట్స్‌తో కలిసి హాస్ట్‌లో గదిలో ఉన్నాడు. తర్వాత ఇద్దరు విద్యార్దులు పని మీద బయటకు వెళ్లారు. 8.30 గంటలకు ఇద్దరు తిరిగి వచ్చే సరికి గది లోపల నుంచి గడియ పెట్టినట్లు గుర్తించారు. బలవంతంగా తలుపు తీయడంతో గదిలో చంద్ర ఊరేసుకొని కనిపించాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా రాత్రి 11.30 అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు’ అని పేర్కొంది. 
చదవండి: Video: గాజా ఆసుపత్రిపై దాడికి ముందు, ఆ తర్వాత దృశ్యాలు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. ప్రాజెక్టు వర్క్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. బాధిత విద్యార్థి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొడుకు మరణ వార్త తెలియగానే క్యాంపస్‌కు చేరుకున్నారు.

కాగా గత కొంతకాలంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థుల ఆత్మహత్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. ఇదే విద్యాసంస్థలో ఏడాదిన్నరలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2014 నుంచి ఐఐటీల్లో 34 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 18 మంది ఓబీసీలు, షెడ్యూల్‌ కులాలకు చెందిన వారు ఉన్నారు.

దేశంలో అకడమిక్‌ ఫెయిల్యూర్‌ కారణంగా ప్రతిరోజూ ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.  2014 నుంచి అక్టోబర్ 2022 మధ్య ఐఐటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)