Breaking News

కాంగ్రెస్‌ ‘సోషల్‌’ టీంలో ఐదుగురు అరెస్ట్‌

Published on Fri, 05/03/2024 - 06:02

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రసంగం వీడియో డీప్‌ ఫేక్‌ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా సభ్యులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గురువారం ఉదయమే కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా టీం ఇన్‌చార్జి సతీశ్‌తోపాటు యాక్టివిస్ట్‌లు నవీన్, తస్లిమా, గీత, వంశీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో ఉన్న సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు తరలించారు. సాయంత్రానికి వారి అరెస్టును ప్రకటించారు. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌ రావడంతో రోజంతా కాస్త హైడ్రామా నడిచింది.

రోజంతా హైడ్రామా.. ఢిల్లీ పోలీసుల నిరీక్షణ..
అమిత్‌ షా ప్రసంగం వీడియో డీప్‌ ఫేక్‌ కేసులో ఇవే ఆరోపణలకు సంబంధించి ఢిల్లీలో మరో కేసు నమోదు కావడంతో రాష్ట్రానికి చెందిన ఆ ఐదుగురు నిందితులను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు గురువారం హైదరాబాద్‌ వచ్చారు. అయితే అప్పటికే సీసీఎస్‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ఢిల్లీ పోలీసులు సైబర్‌ క్రైం ఠాణా వద్దకు చేరుకున్నారు. కానీ ఠాణా లోపలకు మీడియా సహా ఎవరినీ సైబర్‌ క్రైం పోలీసులు అనుమతించలేదు.

దీంతో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా టీంను తాము అరెస్టు చేయకుండా అడ్డుకోవడానికే సైబర్‌ క్రైం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని స్పెషల్‌ సెల్‌ అధికారులు భావించారు. నిందితులను ప్రశ్నించాక నోటీసులు ఇచ్చి పంపిస్తారనే ఉద్దేశంతో సాయంత్రం వరకు బషీర్‌బాగ్‌ ప్రాంతంలోనే కాపు కాశారు. అయితే సీసీఎస్‌ పోలీసులు ఐదుగురి అరెస్టును సాయంత్రం ప్రకటించడంతో స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఆ ప్రాంతం విడిచి వెళ్లారు. నిందితులకు కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తే ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్‌పై ఢిల్లీ తరలించాలని స్పెషల్‌ సెల్‌ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇదీ కేసు..
గత నెల 25న సిద్దిపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తానని మాట్లాడినట్లు ఓ డీప్‌ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దాదాపు అన్ని హ్యాండిల్స్‌ దీన్ని పోస్టు చేయడమో లేదా షేర్‌ చేయడమో చేశాయి. ఈ వీడియోపై బీజేపీ తెలంగాణ జనరల్‌ సెక్రటరీ జి.ప్రేమేందర్‌రెడ్డి గత నెల 27న హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీని ఆధారంగా అధికారులు ఐపీసీతోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో టీపీసీసీ ‘ఎక్స్‌’ ఖాతాను నిందితుల జాబితాలో చూపారు. మరోవైపు ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కూడా ఈ అంశంపై గత నెల 28న కేసు నమోదు చేశారు. దీని దర్యాప్తులో భాగంగా సీఎం ఎ.రేవంత్‌రెడ్డి సహా పలువురి కి నోటీసులు జారీ చేశారు. ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో కొందరు కాంగ్రెస్‌ నేతల వ్యక్తిగత సహాయకులు, సోషల్‌ మీడియా టీం సభ్యులను అరెస్టు చేశారు. ఇందులో భాగంగా టీకాంగ్రెస్‌ సోషల్‌ మీడియా సభ్యులను అరెస్టు చేసేందుకు ఓ ప్రత్యేక బృందం గురువారం హైదరాబాద్‌ వచ్చింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)