Breaking News

ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు

Published on Sat, 11/09/2024 - 06:36

బెంగళూరు: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. రైతు ఆత్మహత్యకు వక్ఫ్‌ భూముల సమస్యతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారాన్ని పంచుకున్నందుకు ఎంపీతోపాటు కన్నడ న్యూస్‌ పోర్టల్స్‌ ఎడిటర్లు ఇద్దరిపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తన భూమిని వక్ఫ్‌ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రుద్రప్ప చెన్నప్ప బాలికై అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని సూర్య తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి బిజెడ్‌ జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌లు రాష్ట్రంలోని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సూర్య ఆరోపించారు. అయితే.. రుణ భారం, పంట నష్టంతో 2022 జనవరిలో రైతు ఆత్మహత్య చేసుకున్నారని హవేరి పోలీసు సూపరింటెండెంట్‌ స్పష్టం చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 

అసహజ మరణాల దర్యాప్తు 
ప్రక్రియ కింద తుది నివేదిక సమరి్పంచిన తర్వాత కేసును ఇప్పటికే మూసేసినట్లు పోలీసులు తెలిపారు. రైతు భూమిని వక్ఫ్‌ భూమిగా రికార్డుల్లో నమోదు చేయడం వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే శీర్షికతో వార్తను ప్రచురించినందుకు గాను.. కన్నడ దునియా ఈ–పేపర్, కన్నడ న్యూస్‌ ఈ–పేపర్‌ ఎడిటర్లపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. హవేరిలో రైతులు వక్ఫ్‌ నోటీసులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని, ఇది రుద్రప్పను మానసిక క్షోభకు గురిచేసిందని ఆ వార్తా కథనం పేర్కొంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)