Breaking News

57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య

Published on Thu, 07/03/2025 - 21:34

ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

 పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని  సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు.  

ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్‌పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కాగా,సదరు నటి  పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్‌ అయ్యారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)