Breaking News

టీడీపీ తెలుగు మహిళా కార్యదర్శి అరెస్ట్‌

Published on Thu, 09/28/2023 - 03:32

గుంటూరు లీగల్‌: సీఎం వైఎస్‌ జగన్‌ పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ తెలుగు మహిళ కార్య­దర్శి పిడికిటి శివ పార్వతిని బుధవారం పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన శివ పార్వతి నగరంలోని జేకేసీ రోడ్డు­లోని విజయపురి కాలనీలో ఉంటుంది. ఆమె టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ తెలుగు మహిళా కార్యదర్శిగా పనిచేస్తూ ఫేస్‌బుక్‌లో ‘లక్ష్మీగణేష్ ఐడీతో పోస్టింగ్‌లు పెడుతుంది.

ఈ నెల 25న సీఎం పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో పోస్టు చేసింది. దీనిపై స్తంబాలగరువుకు చెందిన వైఎస్సార్‌ సీపీ 42వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ చల్లా శేషిరెడ్డి, ఏటి అగ్రహారానికి చెందిన వైఎస్సార్‌ సీపీ గుంటూరు వెస్ట్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ రాజవరపు జగదీష్‌ పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా ఉండటమే కాకుండా అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వీడియో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు.

నిందితురాలు ఇదే తేదీన పోస్టు చేసిన మరో వీడియోపై మారుతీనగర్‌కు చెందిన షేక్‌ ఉస్మాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కూడా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలు సోషల్‌ మీడియాలో తరచూ ఇలాంటి పోస్టింగ్స్‌ పెడుతుందనీ, గతంలో సీసీ నం.1247/­2021 లో కూడా ముద్దాయి అని పేర్కొంటూ , ఆమెకు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించాలని కోరుతూ పట్టాభిపురం పోలీసులు రిమాండ్‌ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. వాదనలు విన్న ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి జి.స్పందన రిమాండ్‌ను తిరస్కరిస్తూ రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)