Breaking News

Hyderabad: జీఎస్టీ అధికారి కిడ్నాప్‌ కేసులో గుంటూరు టీడీపీ నేతలు

Published on Thu, 07/06/2023 - 04:55

సాక్షి ప్రతినిధి, గుంటూరు: జీఎస్టీ సీనియర్‌ అధికా­రి­ని కిడ్నాప్‌ చేసిన కేసులో గుంటూరు టీడీపీ నేత­లు, కుటుంబ సభ్యులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు నగర టీడీపీ నేత సయ్య­ద్‌ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు సయ్యద్‌ ఫిరో­జ్, సయ్యద్‌ ఇంతియాజ్‌లకు హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ పరిధిలోని క్రాంతినగర్‌ రోడ్‌ నంబర్‌ 2­లో ఇనుము వ్యాపారం ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు.

జీఎస్టీ చెల్లించకపోవటంతో బుధవారం జీఎస్టీ, ఇంటెలిజె­న్స్‌ అధికారులు హైదరాబాద్‌లోని దుకాణా­న్ని సీజ్‌చేసేందుకు వెళ్లారు. ఆ అధికారులపై ముజీ­బ్, ఫిరోజ్, ఇంతియాజ్, వారి కారు డ్రైవర్‌ షేక్‌ ముషీర్‌ దాడిచేశారు. గుంటూ­రు నుంచి తాము వెళ్లిన కారులోనే అధికారుల్ని కిడ్నా­ప్‌ చేశా­రు. అధికారుల డ్రైవర్‌ ద్వారా సమాచారం అందుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు కిడ్నాప్‌నకు పాల్పడిన న­లు­­గురిని అదుపులోకి తీసుకుని అధికారులను రక్షించారు.

ముజీబ్‌ ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ఆ పా­ర్టీ కార్యక్రమాల్లో చురు­గ్గా పాల్గొంటున్నారు. లోకేశ్‌ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. హైదరా­బాద్‌లో కిడ్నాప్‌ వ్యవహారంలో గుంటూ­రు టీడీపీ నేతలు అరెస్ట్‌ కావడం చర్చనీయాంశమైంది.  

కుటుంబసభ్యులంతా నేరచరితులే... 
గుంటూరుకు చెందిన ముజీబ్‌ కుటుంబ సభ్యులు తొలినుంచి నేరచరిత్ర కలిగి ఉన్నారు. గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఒక భూమిని ఆక్రమించిన కేసులో ముజీబ్‌ సోదరుడు ఫిరోజ్, ఇంతియాజ్, బషీర్‌ల­పై రౌడీషీట్లున్నాయి. ఆటోనగర్‌లో సైతం గతంలో కత్తులు తీసుకుని ఆ ప్రాంతమంతా హల్‌చల్‌ సృష్టించిన విషయంలో కాకాని పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతోపాటు కొంతమందిపై దాడిచేసిన కేసులున్నాయి.

ఈ క్రమంలో తెలంగాణలో­ని హైదరాబాద్‌లో ముజీబ్, అతడి సోదరులపై అధికారులను కిడ్నాప్‌ చేసిన కేసు నమోదైంది. తొలి­నుంచి వివాదాలకు దిగే ముజీబ్, అతడి కుటుంబ సభ్యులపై మరోమారు కేసు నమోదవడంపై టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. ముజీబ్‌ సోదరుడు సయ్యద్‌ ఫిరోజ్‌ రౌడీïÙట్‌ కలిగి ఉండటంతో పాటు టీడీపీ నగర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ముజీబ్‌ తండ్రి మాత్రం తన కుమారుడు అమాయకుడని, అతడిపై కుట్ర జరిగిందని పేర్కొంటున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)