Breaking News

వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ హత్యాయత్నం

Published on Thu, 06/06/2024 - 04:21

చంద్రగిరి (తిరుపతి జిల్లా)/తిరుపతి క్రైమ్‌: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మత్తులో టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. మంగళవా­రం రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఈ దాడులు బుధ­వారమూ కొనసాగాయి. 

తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు కొందరు గంజాయి మత్తు­లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన మరో వ్యక్తి­ని కూడా గాయపరిచారు. మరో చోట వార్డు సభ్యు­డిపై దాడి చేసి, గాయపరిచారు. తిరు­పతి నగరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 

కత్తులు, రాడ్లతో దాడి 
బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి, పార్టీ మండల కనీ్వనర్‌ మస్తాన్‌­పై టీడీపీ కార్యకర్తలు చంద్రగిరిలో హత్యాయత్నానికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో ఉన్న టీడీపీ కార్యకర్తలు కొందరు బుధవారం రాత్రి మస్తాన్‌ ఇంటి వద్దకు వచ్చారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంతో ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆయనపై కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. 

ఓ వ్యక్తి కత్తితో మస్తాన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకొన్నప్పటికీ వారు ఆగలేదు. టీడీపీ వారిని అడ్డుకోబోయిన మస్తాన్‌ బంధువైన సాదిక్‌ను కూడా గాయపరిచారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు పలువురు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ వారు జారుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మద్యం మత్తులో ధాబా ధ్వంసం 
అదే విధంగా చంద్రగిరి మండలం పరిధిలోని ఐతేపల్లి వద్ద ఉన్న ధాబాను టీడీపీ కార్య కర్తలు కొందరు ధ్వంసం చేశా రు. బుధవారం మద్యం సేవించిన కొందరు టీడీపీ కార్యకర్తలు ధాబా వద్దకు వెళ్లి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న వార్డు సభ్యుడు సక్కూరు వంశీ అక్కడి వెళ్లారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. 

మాపైనే పోలీసులకు చెప్తావా అంటూ వార్డు సభ్యుడు వంశీపై టీడీపీ వారు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ధాబాలోని కురీ్చలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన వంశీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 

తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ధ్వంసం 
తిరుపతి నగరం 8వ డివిజన్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూటమి కార్యకర్తలు ధ్వంసం చేశారు. సంజయ్‌ కాలనీలో ఉన్న ఈ కార్యాలయాన్ని మురళి నిర్వహిస్తున్నారు. షట్టర్‌ ఓపెన్‌ చేసి గ్లాస్‌ డోర్‌కు తాళం వేసుకుని వెళ్లిన సమయంలో కూటమి మూకలు రాళ్లతో దాడిచేసి లోపలికి ప్రవేశించి ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారు. టీవీలు, కంప్యూటర్లు, బల్లలు అన్నింటినీ విరగ్గొట్టారు. పోలీసులు ఘటన స్థలానికి చేరు­కు­ని కార్యాలయం ని­ర్వా­హకుల నుంచి ఫిర్యా­దు తీసుకొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)