Breaking News

‘ధరణి’లో నమోదుకు రూ.40 లక్షలు

Published on Wed, 02/14/2024 - 04:20

శామీర్‌పేట్‌: ధరణి పోర్టల్‌లో భూ వివరాల నమోదుకు రూ. 40 లక్షలు డిమాండ్‌ చేసిన  ఓ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మజీద్‌ అలీఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం..సిటీకి చెందిన రామశేషగిరిరావు శామీర్‌పేట మండల పరిధిలోని లాల్‌గడీ మలక్‌పేట్‌లో 2006లో భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి సంవత్సరం క్రితం తహసీల్దార్‌ సత్యనారాయణను సంప్రదించగా,  రూ.40 లక్షలు డిమాండ్‌ చేశారు.

ఇందులో భాగంగానే గతంలో రామశేషగిరిరావు రూ.10లక్షలు ఇచ్చి, మరో 20లక్షల చెక్కు ఇచ్చాడు. తాజాగా మిగతా సొమ్ము రూ.10లక్షలు మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో సత్యనారాయణ డ్రైవర్‌ బద్రికి ఇస్తుండగా,  అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు తాము దాడులు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. తహసీల్దార్‌ సత్యనారాయణ నివాసముంటున్న తూంకుంటలోనూ ఏసీబీ అధికారులు మరిన్ని సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో  ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు మల్లికార్జున్, పురంధర్‌భట్‌ తదితరులు పాల్గొన్నారు. 

కరీంనగర్‌లోనూ సోదాలు 
కరీంనగర్‌క్రైం: ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు  కరీంనగర్‌ విద్యానగర్‌లోని తోడేటి సత్యనారాయణ నివాసంలో సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పూడూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో సత్యనారాయణ భార్య రేణుక టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెను కూడా ఏసీబీ పోలీసులు విచారించి పలు డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. 

ఏడాది నుంచి తిరుగుతున్నా... 
ధరణి పోర్టల్‌లో భూవివరాల నమోదుకు ఏడాది నుంచి తహసీల్దార్‌ చుట్టూ తిరుగుతున్నా ఆయన  పనిచేయలేదని బాధితుడు రామశేషగిరిరావు తెలిపారు. లాల్‌గడీ మలక్‌పేట్‌లో 2006 సంవత్సరంలో తాను 29 ఎకరాల భూమి కొనుగోలు చేశానని, ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి రూ.40 లక్షలు డిమాండ్‌ చేశాడని తెలిపారు.

తాను ఇంతకుముందు రూ.10 లక్షలు నగదు రూపంలో, 20 లక్షలు చెక్కురూపంలో చెల్లించానని చెప్పారు. 30 లక్షలు ఇచ్చినా తన పని కాకపోవడంతో విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని చెప్పారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)