Breaking News

తలకోన జలపాతం: విహారయాత్రలో విషాదం.. సుమన్‌ మృతి

Published on Sat, 07/01/2023 - 12:32

సాక్షి, తిరుపతి: తలకోన జలపాతం వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. విహారం కోసం వెళ్లిన యాత్ర.. విషాదకరంగా ముగిసింది. జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయ చెన్నైకి చెందిన సుమన్‌(23) మృతిచెందాడు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

వివరాల ప్రకారం.. స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి సుమన్‌ మృత్యువాతపడ్డాడు. జలపాతం వద్ద ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సుమన్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కాగా, చెన్నైలో ఎమ్మెస్సీ చదువుతోన్న సుమంత్‌ తిరుపతికి చెందిన సహ విద్యార్ధితో కలిసి తలకోనకు వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. జలపాతంపై నుంచి దూకుతూ వీడియో తీయమని స్నేహితుడిని కోరాడు. 

ఈ క్రమంలో పై నుంచి తలకిందులుగా నీళ్లలోకి దూకిన సుమంత్‌ కనిపించకపోకవడంతో స్నేహితుడు ఆందోళన చెందాడు. సుమంత్‌ తలభాగం బండరాళ్లతో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రవారిపాలెం పోలీసులు శుక్రవారం రాత్రి వరకు సుమంత్‌ను బయటికి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చీకటిపడటంతో శనివారం ఉదయం వెలికితీస్తామన్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు సుమంత్‌ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా తలకోనలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ముగ్గురు యువకులు జలపాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: ప్లాట్‌ఫామ్‌పై పిచ్చి చేష్టలు.. లోకల్‌ ట్రైన్‌ ఢీకొనడంతో గాల్లోకి ఎగిరి.. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)