Breaking News

రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం

Published on Sat, 06/05/2021 - 14:12

సాక్షి, న్యూఢిల్లీ: సర్వీస్‌ రివాల్వర్‌తో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ తూటా తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మృతుడు పాండవ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. స్టేషన్‌ ఆవరణలోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడడంతో ఢిల్లీ ఉలిక్కిపడింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

పాండవ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు 2017లో ఎస్సైగా రాహూల్‌ సింగ్‌ (31) బాధ్యతలు చేపడుతున్నారు. నాలుగేళ్లుగా ఒకే స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం స్టేషన్‌ ఆవరణలోనే తన సర్వీస్‌ రివాల్వర్‌ను తీసుకుని రాహుల్‌ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్‌లో రక్తపు మడుగుల్లో ఆయన పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న అతడి భార్య స్టేషన్‌కు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే తన భర్త ఆత్మహత్యకు కారణం పని ఒత్తిడి అని ఆరోపించింది. స్టేషన్‌ అధికారి (సీఐ) ఒత్తిడితో తన భర్త ఆందోళనకు గురవుతున్నాడని ఆమె తెలిపింది.

చదవండి: కారులోనే ముగ్గురు సజీవదహనం
చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్‌

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)