తరగతి గదిలో కాల్పుల కలకలం

Published on Mon, 02/09/2026 - 20:01

చంఢీగడ్‌: లా కాలేజీ తరగదిలో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని తోటి విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తరగతి గదికి గన్‌తో వచ్చిన ఓ విద్యార్థి.. తోటి విద్యార్థినిపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం, తనని తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో తరన్‌ తారన్‌ జిల్లాలో చోటు చేసుకుంది

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన పంజాబ్‌ ఉస్మాలోని మై భాగో లా కాలేజీలో జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని మల్లియన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్గా, మరణించిన విద్యార్థినిని నౌషెహ్రా పన్నువాన్‌కు చెందిన సందీప్ కౌర్‌గా గుర్తించారు. కౌర్ అక్కడికక్కడే మరణించగా, ప్రిన్స్ రాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో ప్రిన్స్ రాజ్ కాలేజీ బ్యాగ్‌తో తరగతి గదిలోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో సందీప్ కౌర్ తన స్నేహితురాలితో మాట్లాడుతుండగా, ప్రిన్స్ రాజ్ వారిద్దరి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. కొద్దిసేపటికి ముగ్గురూ వెనుక సీట్లలో కూర్చున్నారు. అయితే కొన్ని క్షణాల తర్వాత ప్రిన్స్ రాజ్ అకస్మాత్తుగా లేచి, బ్యాగ్‌లోని తుపాకీని బయటకు తీసి, సందీప్ కౌర్‌పై నేరుగా కాల్పులు జరిపాడు. కౌర్ నేలపై కుప్పకూలగా, మరో క్లాస్‌మేట్ షాక్‌తో వెనక్కి తగ్గింది. వెంటనే ప్రిన్స్ రాజ్ తనపై తానే కాల్పులు జరిపి నేలకొరిగాడు.

కాల్పులు జరిగిన వెంటనే తరగతి గదిలోని విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. తరగతులు ప్రారంభం కానున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత కలకలం రేపింది. సందీప్ కౌర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థిని సందీప్ కౌర్ తల్లి కాల్పుల ఘటనపై స్పందించారు. ప్రిన్స్ రాజ్ తుపాకీతో కళాశాలలోకి ఎలా ప్రవేశించాడని ప్రశ్నించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. 

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)