Breaking News

నీటి కుంటలో పడి శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థి మృతి

Published on Mon, 12/16/2024 - 11:01

సాక్షి, పల్నాడు జిల్లా:  రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ మహిళ, శ్రీచైతన్య స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. 

పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం పులిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ (11) ప్రాణాలు కోల్పోయాడు.  స్కూల్‌ బస్సు పులిపాడు గ్రామం నుండి స్కూల్ విద్యార్థులతో దాచేపల్లికి వెళ్తుంది. ఆ సమయంలో స్కూల్ బస్ రేడియేటర్లో మంటలు చెలరేగాయి.  

దీంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు బస్సు క్లీనర్‌ పప్పుల కోటేశ్వరరావు ప్రయత్నించాడు. ఇందుకోసం కుంటలో ఉన్న నీటిని తోడేందుకు ప్రయత్నించాడు. సాయం కోసం సుభాష్‌ను వెంట తీసుకెళ్లాడు. అయితే నీటి కుంటలో నుంచి నీటిని తోడేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవ శాత్తూ కాలు జారి నీటి కుంటలో జారి ఇద్దరూ పడిపోయారు. ఈ దుర్ఘటనలో బస్సు క్లీనర్‌ పప్పుల కోటేశ్వరరావు, ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ మృతి చెందారు.

మరో దుర్ఘటనలో 
తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న మరో దుర్ఘటనలో బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు స్కూటీపై వెళ్తున్న మహిళను ఓ కారు ఢీకొంది. రూరల్‌ ఎస్‌ఐ ఎస్కే మూర్తి తెలిపిన వివరాల మేరకు.. నగరి మండలం మాంగాడుకు చెందిన గోవిందమ్మ(48), తన కుమారుడు భానుప్రకాష్‌ సమీప బంధువు కిరణ్‌తో కలిసి చంద్రగిరి మండలం పిచ్చినాయుడుపల్లిలో బంధువుల ఇంట్లో పురుడు ఫంక్షన్‌కు స్కూటర్‌లో వెళ్తున్నారు.

పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై వకుళామాత ఆలయం సర్కిల్‌ వద్ద పేరూరు పంచాయతీలో నుంచి వేగంగా బైపాస్‌ పైకి దూసుకొచ్చిన గుర్తు తెలియని కారు గోవిందమ్మ ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో గోవిందమ్మ స్కూటర్‌పై నుంచి కింద పడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

స్కూటర్‌ నడుపుతున్న కిరణ్, మృతురాలి కుమారుడు భానుప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని తిరుపతి రూరల్‌ ఎస్‌ఐ ఎస్కే మూర్తి పరిశీలించారు. కేసు నమోదు విచారిస్తున్నట్లు ఎస్‌ఐ మూర్తి తెలిపారు.

శ్రీచైతన్య స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?