Breaking News

అనాథశ్రమం ముసుగులో అరాచకాలు.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

Published on Fri, 01/19/2024 - 15:38

మధ్య ప్రదేశ్‌లో అనాథాశ్రయం పేరుతో జరుగుతున్న అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం నిర్వహిస్తున్న సిబ్బంది చిన్నారులను తీవ్ర వేధింపులకు గురిచేశారు. పసివాళ్లనే జాలి లేకుండా చిన్న చిన్న తప్పుల పేరుతో భయంకరంగా చిత్రహింసలకు గురిచేశారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ బాగోతం బట్టబయలైంది.  

ఇండోర్‌లోని అనాథ శరణాలయంలో సుమారు 21 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఆ ఆశ్రమంలో గతవారం సీడబ్ల్యూసీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దీంతో అనాథ బాలలు తమ బాధలను, వేధింపులను అధికారులకు మొరపెట్టుకున్నారు. చిన్న చిన్న తప్పిదాలకే ఆశ్రమం సిబ్బంది తీవ్రంగా వేధించేవారని వాపోయారు.

‘చిన్నారులను  తలకిందులుగా వేలాడదీయడం, వేడి ఐరన్‌ రాడ్‌తో కొట్టడం, బట్టలు తీసేసి ఫోటోలు తీయడం వంటివి చేసేవారు. ఎర్ర మిరపకాయలను కాల్చడం వల్ల వచ్చే పొగను కూడా పీల్చుకునేలా చేశారు’ అని అధికారులు తెలిపారు. మరీ దారుణంగా నాలుగేళ్ల పిల్లవాడు ప్యాంట్‌లో బాత్రూం వెళ్లాడని అతడిని రెండు మూడు రోజులు వాష్‌రూమ్‌లో బంధించి ఆహారం ఇవ్వకుండా వేధించినట్లు చెప్పారు.

సీడబ్ల్యూసీ అధికారుల ఫిర్యాదు మేరకు అయిదుగురు అనాథాశ్రయం సిబ్బందిపై కేసు నమోదైంది. అనాథ శరణాలయాన్ని వెంటనే సీజ్‌ చేశారు. చిన్నారులను ప్రభుత్వం షెల్టర్‌కు తరలించినట్లు ఇండోర్‌ ఏసీపీ అమరేంద్ర సింగ్‌ తెలిపారు.  చిన్నారులపై వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 

కాగా  హోంలోని పిల్లలు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అనాథలుగా గుర్తించారు. అయితే ఆ అనాథశ్రమాన్ని  వాత్సల్యపురం జైన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది, దీనికి బెంగళూరు, సూరత్, జోధ్‌పూర్, కోల్‌కతాలో కూడా బ్రాంచ్‌లు ఉన్నాయి.
చదవండి: ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)