Breaking News

గంజాయి, అక్రమ మద్యంపై సెబ్‌ దాడులు

Published on Wed, 06/07/2023 - 07:31

సాక్షి, అమరావతి: ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయితోపాటు డ్రగ్స్‌ విక్రయాలు, అక్రమ మద్యం విక్రయాలు, సారా తయారీపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. మే నెలలోనే 169 గంజాయి కేసులు నమోదు చేసి 710 మందిని అరెస్టు చేసింది. 7,222.16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు 92 వాహనాలను జప్తుచేసింది. మూడు మాదకద్రవ్యాల కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసింది. 3,100 పెంటజోయిస్‌ ఇంజక్షన్‌ సీసాలు, 4.23 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకుంది.

2,115 సారా కేసుల్లో 13,828 లీటర్ల సారా, 1,198.5 కిలోల ఊట బెల్లాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు 1,274 మందిని అరెస్టు చేసింది. 896 అక్రమ మద్యం కేసులు నమోదు చేసి 588 మందిని అరెస్టు చేయడంతోపాటు 1,664.94 లీటర్ల అక్రమ మద్యం, 144.6 లీటర్ల బీరును స్వాధీనం చేసుకుని, 21 వాహనాలను జప్తుచేసింది. 40 లీటర్ల అక్రమ కల్లును కూడా స్వాధీనం చేసుకుంది. 30 ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసుల్లో 161 మందిని అరెస్టు చేయడంతోపాటు 264 ఎర్రచందనం దుంగలను, 25 వాహనాలను జప్తుచేసింది. మే నెలలో గంజాయి కేసుల్లో 30 మందిపై, సారా కేసుల్లో ఎనిమిది మందిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్టు సెబ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

చదవండి: IAS vs IPS: ఐపీఎస్‌ రూపకు ముందస్తు బెయిల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)