Breaking News

హ‌మ్మ‌య్య.. ఎట్ట‌కేల‌కు ప‌ట్టుబ‌డ్డారు

Published on Tue, 09/02/2025 - 15:37

సాక్షి, హైద‌రాబాద్‌: దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 33 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఆర్ఫీఎఫ్‌ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 54 రాళ్లదాడులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆయా సంఘటనలపై 30 కేసులు నమోదు చేశామన్నారు. రైల్వే ట్రాక్‌లపై ప్రమాద కారకమైన వస్తువులను ఉంచినందుకు నమోదైన 8 కేసుల్లో ఏడుగురిని అరెస్టు చేశారు.

రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్‌ లపై ప్రమాదకారకమైన వస్తువులను ఉంచడం వంటి నేరాలకు పాల్పడితే రైల్వే చట్టం, ఇతర క్రిమినల్‌ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణకు రైల్వే అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. రైల్వే ఆస్తుల‌పై దాడులకు పాల్ప‌డివారే గురించి 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.

కారు అద్దాలు పగులగొట్టి రూ. 4.79 లక్షలు చోరీ 
అత్తాపూర్‌: కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రూ. 4.79 లక్షలు చోరీ చేసిన సంఘటన అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి, ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శివరాంపల్లి ప్రాంతానికి చెందిన రాజు లింగయ్యగౌడ్, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన దేవదాస్‌గౌడ్‌ ఉప్పర్‌పల్లి చౌరస్తాలో త్రిబుల్‌ ఆర్‌వైన్స్‌ నిర్వహిస్తున్నారు. 

ఆదివారం రాత్రి  తమ షిఫ్ట్‌ కారు వెనుక సీట్‌లో కవర్‌లో రూ. 4.79 లక్షల నగదు ఉంచారు. గోల్డెన్‌ ప్యాలెన్‌ హోటల్‌ సర్వీస్‌ రోడ్డులో కారు పార్క్‌ చేసి హోటల్‌లో టీ తాగి వచ్చేసరికి కారు అద్దం పగిలి ఉన్నాయి. డబ్బుతో ఉన్న కవర్‌ కనిపించలేదు. రాజలింగయ్యగౌడ్‌ ఫిర్యాదు మేరకు అత్తాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినిపై కేసు నమోదు 
చందానగర్‌ సర్కిల్‌ 21లోని సీఎస్‌సీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ సుభాషిణి 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను వసూళ్ల డబ్బును బల్దియా అకౌంట్‌లో జమ చేయకుండా  సొంతానికి ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడిట్‌ అధికారులు తనిఖీలు చేపట్టడంతో ఆమె  తిరిగి రూ.56 లక్షలు బల్డియా అకౌంట్‌లో జమ చేసింది. 

ఈ విషయం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు చందానగర్‌ సర్కిల్‌ 21 డిప్యూటీ కమిషనర్‌ శశిరేఖ సోమవారం చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.   

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు