Breaking News

తల్లి తలను నరికి.. ఆ తలతో అటూ ఇటూ తిరిగి..

Published on Fri, 02/10/2023 - 02:19

జనగామ రూరల్‌:  చెల్లికి భూమి రాసి ఇచ్చి.. తనకు మాత్రం భూమి  ఇవ్వడం లేదన్న కక్షతో కన్నతల్లిని ఓ కొడుకు అత్యంత కర్కశంగా చంపేశాడు.  చికెన్‌కొట్టే కత్తితో తల్లి మెడ నరికి తలను వేరు చేశాడు. అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన జనగామ జిల్లా జనగామ మండలం మరిగడి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మరిగడి గ్రామానికి చెందిన కూరాకుల రాజయ్య, రమణమ్మలకు కుమారుడు కన్నప్ప, కూతురు లావణ్య ఉన్నారు. వీరికి పది ఎకరాల భూమి ఉంది.

పదేళ్ల క్రితం రాజయ్య పక్ష వాతంతో చనిపోయాడు. గతంలో చికెన్‌ దుకాణం నడిపిన కన్నప్ప రెండు నెలలుగా స్థానికంగా సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె తన భర్తతో గొడవపడి మూడు నెలలనుంచి తల్లి వద్దే ఉంటోంది. ఈక్రమంలో కుమార్తెకు ఎలాంటి ఆధారం లేనందున ఉన్న భూమిలో కొంత ఇవ్వాలని తల్లి రమణమ్మ కొద్ది కాలంగా కుమారుడితో పట్టుబడుతోంది. ఇందుకు అతను సుముఖంగా లేకపోవడంతో  పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో కన్నప్పకు తెలియకుండా గత నెల 30న కుమార్తెకు 4ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేసింది.

విషయం తెలుసుకున్న కుమారుడు మిగిలిన భూమిని తనకు ఇవ్వాలని తల్లిని కోరాడు. ఇందుకు ఆమె ససేమిరా అంది. తాను బతికి ఉండగా ఆస్తిని ఇవ్వనని.. కుమారుడికి తెగేసి చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు.  నాలుగు రోజుల క్రితం ఇరువురూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోగా కుమారుడిపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో గురువారం ఉదయం చెల్లి లావణ్య పాల కోసం బయటకు వెళ్లింది.

బైక్‌పై వచ్చిన కన్నప్ప వెంట తెచ్చుకున్న చికెన్‌ కొట్టే కత్తితో ఇంటిగడప వద్ద ఉన్న తల్లి రమణమ్మ (60) మెడపై నరికాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆ తరువాత తలను వేరు చేసి దానిని పట్టుకుని ఇంటిముందు అటూ ఇటూ కాసేపు తిరిగాడు. అనంతరం బైక్‌పై వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. జనగామ డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, సీఐ,  ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)