Breaking News

తమిళనాడులో దారుణం.. ఐటీ ఉద్యోగిని హత్యలో డబుల్‌ ట్విస్ట్‌

Published on Sun, 12/24/2023 - 16:53

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నందిని దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. దీంతో ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. 

వివరాల ప్రకారం.. చెన్నై శివారులోని తాలంబూర్‌లో దారుణం జరిగింది. శనివారం రాత్రి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నందిని(25)ని ప్రియుడు వెట్రిమారన్‌(26) కిరాతకంగా హత్య చేశాడు. వెట్రిమారన్‌ మొదట నందినిని బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచి, అనంతరం ఆమెను గొలుసులతో బంధించి, చివరగా ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. సగం కన్నా ఎక్కువ కాలిపోయి ఉన్న డెడ్‌బాడీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

అయితే.. నందిని, వెట్రిమారన్‌ మధురైలోని ఒకే ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్నారని పోలీసులు తెలిపారు. ఎనిమిది నెలల క్రితమే వీరిద్దరూ ఒకే కంపెనీలో జాబ్‌ చేస్తున్నారని, ప్రేమించుకుంటున్నారని వెల్లడించారు. కాగా, నందినిపై అనుమానంతోనే వెట్రిమారన్‌ ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించారు. ఈ కేసులో వెట్రిమారన్‌ను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ కస్టడీకి పంపినట్టు తెలిపారు. అయితే, ఈ హత్యలో ఓ ట్రాన్స్‌జెండర్‌ పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక్కడ, మరో ట్విస్ట్‌ ఏంటంటే.. వెట్రిమారన్‌ అలియాస్‌ పాండి మహేశ్వరి గత ఆరు నెలల క్రితమే అబ్బాయిగా మారడం గమనార్హం. మహేశ్వరి.. వెట్రిమారన్‌గా అబ్బాయిగా పేరు మార్చుకున్నాడు. దీంతో, కొద్దిరోజులుగా వెట్రిమారన్‌ను నందిని దూరం పెడుతుండటంతోనే ఆమెను హత్య చేసినట్టు సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)