Breaking News

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

Published on Fri, 10/25/2024 - 08:00

సాక్షి, హైదరాబాద్‌: కోకాపేట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడు అంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణం చెందారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. కోకాపేట్‌లో హాస్టల్ గదికి వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నాగ ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

మూడో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి 
మూడవ అంతస్తు నుంచి పడి ఓ మృతి చెందిన ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్, గోరఖాపూర్‌ ప్రాంతానికి చెందిన గణేష్‌(19) సొంత గ్రామానికి అఖిలేష్‌, అజిద్, మజ్ను కలిసి నగరానికి వచ్చి ఎల్‌బీనగర్‌ చింతల్‌కుంట ఎల్‌పీటీ మార్కెట్‌ వెనుక వైపు సిల్క్‌ టవర్‌ బిల్డింగ్‌ పని చేస్తూ అదే భవనంలోని మూడవ అంతస్తులో ఉంటున్నారు.

ఈ నెల 22 రాత్రి అందరూ కలిసి మద్యం తాగారు. కూరగాయలు తీసుకు రావాలని గణేష్‌కు డబ్బులిచ్చి పంపారు. కానీ.. గణేష్‌ మళ్లీ మద్యం తాగి వచ్చాడు. అందరూ భోజనం చేసి పడుకున్నారు. మద్యం మత్తులో ఉన్న గణేషఅర్ధరాత్రి మూడవ అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్నేహితులు నాగోలులోని ఓ హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిప వైద్యులు అప్పటికే గణేష్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు.
 

 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)