Breaking News

సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన చంద్రబాబు

Published on Fri, 12/08/2023 - 19:33

సాక్షి, తెనాలి: సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. స్కిల్ స్కాంపై ఎక్కడా మాట్లాడకూడదని కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. అయితే, రూల్స్‌ను ఉల్లంఘిస్తూ తెనాలిలో స్కిల్ స్కాంపై చంద్రబాబు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘లీగల్‌గా, టెక్నికల్ గా తప్పు చేయకున్నా జైల్లో పెట్టారంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు.. అరెస్ట్‌ చేసినందుకు సీఐడీ పోలీసులను, రిమాండ్‌కు పంపినందుకు కోర్టును తప్పుబట్టారు.

కేసు గురించి ప్రసావించ వద్దంటూ సుప్రీంకోర్టు నిబంధన విధించగా, అయినా సరే, కేసు గురించి చంద్రబాబు బహిరంగంగా మాట్లాడారు. దీనిబట్టి కోర్టులన్నా, చట్టాలన్నా చంద్రబాబుకు గౌరవం లేదని స్పష్టమవుతోంది. ఇది కచ్చితంగా బెయిల్‌ నిబంధన ఉల్లంఘనేనని, బెయిల్‌ ఎందుకు రద్దు చేయకూడదని న్యాయ నిపుణులు అంటున్నారు.

కాగా, స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని హరీష్ సాల్వే కోరారు. కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని హారీష్ సాల్వే ప్రస్తావించారు. నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం.. సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..!

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)