Breaking News

ఆటో స్టీరింగ్‌పై సెల్‌ఫోన్‌ పెట్టి రీల్స్‌ చూస్తూ..

Published on Wed, 11/27/2024 - 11:18

లంగర్‌హౌస్‌: ఆటో స్టీరింగ్‌పై సెల్‌ఫోన్‌ పెట్టి రీల్స్‌ చూస్తూ.. చెవిలో ఇయర్‌ ఫోన్లు పెట్టుకొన్న డ్రైవర్‌ ఆగిఉన్న ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పాటు అతడికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన కార్తీక్, సంగారెడ్డికి చెందిన తరుణ్‌ రెడ్డి, సాతి్వక్, ఖమ్మంలో నివాసం ఉండే స్వరాజ్, ఆసిఫాబాద్‌కు చెందిన హరికృష్ణ ప్రాణ స్నేహితులు. 

వీరు ఇబ్రహీంబాగ్‌లోని వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన వివేక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది చేరాడు. వీరు లంగర్‌హౌస్‌ బాపునగర్‌లోని పీఎస్‌ఆర్‌ హాస్టల్‌లో.. వివేక్‌ తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటలకు పరీక్షలు రాయాల్సి ఉండటంతో లంగర్‌హౌస్‌ బాపుఘాట్‌ వద్ద ఆటోలో  బయల్దేరారు. రాందేవ్‌గూడ సమీపంలోకి రాగానే రోడ్డు మధ్యలో డివైడర్‌ పక్కనే ఓ ఆటో ట్రాలీ నిలిచి ఉంది. విద్యార్థులున్న ఆటో వేగంగా వచ్చి వెనక నుంచి ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వివేక్, కార్తీక్, ఆటో డ్రైవర్‌ మల్లే‹Ùలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణం: క్షతగాత్రులు 
ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న విద్యార్థులు తెలిపారు. ప్రమాదానికి ముందు ఆటో డ్రైవర్‌ స్టీరింగ్‌పై సెల్‌ఫోన్‌లో రీల్స్‌ చూస్తున్నాడని, చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకున్నాడని క్షతగాత్రులు తెలిపారు. రోడ్డుపై ఆటో ట్రాలీ ఆగిఉన్న విషయం తాము గమనించి అరిచినా.. డ్రైవర్‌ చెవుల్లో ఇయర్‌ ఫోన్స్‌ ఉండటంతో వినిపించలేదని.. అతని కళ్లు రీల్స్‌పై ఉండటంతో అంతే వేగంగా దూసుకెళ్లి ఆటో ట్రాలీని ఢీకొన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆటో డ్రైవర్‌ మల్లే‹Ùను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)