Breaking News

బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు!

Published on Wed, 07/05/2023 - 12:23

సాక్షి, హైదరాబాద్‌: బండ్లగూడ హైదర్షాకోట్‌ వద్ద రోడ్డు పక్కన ఉదయం పూట వాకింగ్‌ చేస్తున్న ఇద్దరి ప్రాణాలను కారు ప్రమాదం బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణాలు తీసిన బద్రుద్దీన్ ఖాదిరి దగ్గర అసలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్‌ చేసి పారిపోయిన బద్రుద్దిన్‌, ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ కనీసం గాయపడ్డ వారి గురించి సమాచారం కూడా ఇవ్వలేదు.

షాకైన పోలీసులు..
బద్రుద్దిన్‌ వెంట గణేష్‌, మహమ్మద్‌ ఇబ్రహీం, ఫైజన్‌ అనే వ్యక్తులు ఉన్నారు. యాక్సిడెంట్‌ జరగ్గానే డామేజ్‌ అయిన కారులోంచి జంప్‌ అయ్యారు. అప్పటికప్పుడు మరో ఫ్రెండ్‌కు వీరు కాల్‌ చేశారు. కాసేపటి తర్వాత మరో మిత్రుడు AP 09 BJ 2588 నెంబర్‌ గల కారుతో స్పాట్‌కు వచ్చాడు. అక్కడ నుంచి నేరుగా మొయినాబాద్‌ ఫాంహౌజ్‌కు పారిపోయారు. యాక్సిడెంట్‌ చేశామన్న స్పృహ లేకుండా పార్టీకి ఏర్పాట్లు చేసుకున్న ఆ గ్యాంగ్‌ను చూసి.. ఫాంహౌజ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌ తిన్నారు. అప్పటికే ఫుడ్‌, డ్రింక్స్‌, స్టఫ్‌ రెడీ చేసుకుంటున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేని బద్రుద్దిన్‌కు కారు ఎలా ఇచ్చారన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు ఏం జరిగిందంటే?
మైనార్టీ తీరి మేజర్‌ అయ్యాననే ఆనందంతో ఉన్న యువకుడు రాత్రంతా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పుట్టిన రోజు వేడుకలను మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో మరికొందరితో కలిసి చేసుకోవడానికి స్నేహితులతో కలిసి కారులో దూసుకుపోతున్నాడు. మితిమీరిన వేగంతో దూసుకువస్తున్న కారు లంగర్‌హౌస్‌–కాళిమందిర్‌ మార్గంలోని హైదర్షాకోట్‌ వద్ద మలుపు తిప్పుతూ అదుపు తప్పింది. బ్రేక్‌ వేయగా రోడ్డుపై ఉన్న ఇసుక ఫలితంగా స్కిడ్‌ అయి వాకింగ్‌ చేస్తున్న నలుగురిపై నుంచి దూసుకుపోయింది. కారు ఎడమ వైపు భాగం బలంగా తగలడంతో తల్లీకూతుళ్లు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వాకర్స్‌ తీవ్రంగా గాయపడ్డారు.

పౌరుల ప్రాణాలు గాలిలో దీపంలా
ఈ ఘటన నగరవాసుల భద్రతను ప్రశ్నిస్తోంది. పౌరుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయనే ఆవేదన ఉదయిస్తోంది. ఏ వైపు నుంచి ఏ వాహనం ఎంత వేగంగా వస్తుందో తెలియని పరిస్థితుల్లో.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందేనని.. నగరంలో ఇలాంటి ప్రమాదాలు షరామామూలుగా మారాయని పలువురు ఆక్రందన వ్యక్తంచేస్తున్నారు. కారును వేగంగా నడిపి  ఉదయం పూట వాకింగ్‌ చేస్తున్న అభమూ శుభమూ తెలియని ఇద్దరి ప్రాణాలను బలిగొన్న బద్రుద్దిన్‌ గ్యాంగ్‌ను కఠినంగా శిక్షించాలంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)