Breaking News

‘నా భర్తను కాపాడండి.. నా చివరి కోరిక తీర్చండి’

Published on Tue, 08/26/2025 - 18:54

సాక్షి,మహబూబ్‌ నగర్‌: యశోద అనే మహిళ రేబిస్‌ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తాను పడుతున్న మనోవేధనను, చివరి కోరికను ఇంట్లో బ్లాక్‌ బోర్డుపై రాసింది.

నా భర్తను కాపాడండి.. రేబిస్‌ ఉంది. వ్యాక్సిన్‌కు తగ్గదు. చెట్టు మందు తినిపించండి. మీరు చేయించండి

లక్కీని ఆస్పత్రిలో చూపించు వాడికి రేబిస్‌ ఉంది.

నా చివరి కోరి ధారూర్‌(వికారాబాద్‌)లో చెట్టు మందు తాగు.. లేట్‌ చేయకు.. అంటూ బాధితురాలు తన చివరి క్షణాల్లో కుటుంబం గురించి ఆలోచించి తనువు చాలించింది.  

మహబూబ్‌ నగర్‌ జిల్లా మొనప్పగుట్టలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. యశోద అనే మహిళ రేబిస్‌ వ్యాధి సోకిందన్న అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది.

పోలీసుల వివరాల మేరకు..యశోద గత జూన్‌ నెలలో తన ఇంటి ఆవరణలో పల్లీలు,డ్రై ఫ్రూట్స్‌ ఆరబెట్టింది. అవే పల్లీలు,డ్రై ఫ్రూట్స్‌ను వంటకాల్లో వాడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ సభ్యులకు రేబిస్‌ సోకిందని అనుమానం పెట్టుకుంది.

ఆ అనుమానంతోనే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ యాంటీ రేబిస్‌ ఇంజక్షన్‌ చేయించింది. నాటు వైద్యం చేయించుకునేలా బలవంతం చేసింది. కుటుంబ సభ్యులందరికీ రేబిస్‌ సోకిందని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో తన మూడేళ్ల కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది.

ఘటన జరిగిన సమయంలో ఆఫీస్‌కు వెల్లిన యశోద భర్త.. ఇంటికి ఫోన్‌ చేశాడు. అమ్మ బెడ్రూంలోకి వెళ్లి డోర్‌ తీయడం లేదని చెప్పాడు. దీంతో భయపడిపోయిన నరేష్‌ పక్కింటి వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో పక్కింటి వారు బెడ్రూం రూమ్‌ బలవంతంగా ఓపెన్‌ చేసి చూడగా.. తల్లి,కుమార్తె విగతజీవులుగా కనిపించారు. కాగా, భర్త, కొడుకు మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని ఆత్మహత్య చేసుకునే ముందు యశోద గోడపై రాయడం గమనార్హం. యశోద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)