Breaking News

ఆస్తిలో వాటా కోసం, చిన్నబావమరిదికి స్కెచ్‌.. కట్‌ చేస్తే!

Published on Fri, 04/18/2025 - 16:33

ఘట్‌కేసర్‌: ఆస్తి పంపకాల్లో వాటా కోసం రెక్కీ ఏర్పాటు చేసిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకుషాపూర్‌ గ్రామానికి చెందిన బోనాల రాజశేఖర్, ఈశ్వర్‌ తమ సోదరి లావణ్యను కొండాపూర్‌ మసీదుబండకు చెందిన మేడ్చల్‌ శ్రీనివాస్‌తో వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ. 12 లక్షలు, ఎకరం భూమి కట్నంగా ఇచ్చారు. అయితే తర్వాత తండ్రి పెంటయ్య ఉద్యోగ విరమణతో వచ్చినడబ్బులోనూ తనకు వాటా కావాలని సోదరి లావణ్య సోదరులను డిమాండ్‌ చేసింది. దీంతో ఇచ్చిన ఎకరం భూమి విక్రయించిందని, తిరిగి డబ్బులు ఇచ్చేది లేదనడంతో గొడవ ప్రారంభమైంది.  

బావమరుదుల కదలికలపై రెక్కీ.. 
బావమరుదుల కదలికలు తెలుసుకునేందుకు శ్రీనివాస్‌ టోలీచౌక్‌కు చెందిన బాబు షేక్‌ సాహెల్‌ (20), ఎండీ ఇర్ఫాన్‌ (20), మహమ్మద్‌ అబ్బు, సల్మాన్‌(18)తో పాటు మరో మైనర్‌తో రూ.15 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. రూ. 1000 చొప్పున 3 సార్లు గూగుల్‌ పే ద్వారా డబ్బు పంపించి చిన్నబావమరిది ఈశ్వర్, ఇంటి, లొకేషన్‌ ఫొటోలు శ్రీనివాస్‌ ఇర్ఫాన్‌కు అందజేశాడు. బుధవారం ఉదయం వారు అంకుషాపూర్‌ గ్రామంలో బైక్‌ నంబర్‌ కనిపించకుండా జాగ్రత్త పడటం, ముఖాలకు మాస్క్‌లు ధరించి అనుమానాస్పదంగా రెక్కీ నిర్వహిస్తుండగా.. స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో  వారిని పట్టుకుని ఫోన్‌ తనిఖీ చేయగా బావ శ్రీనివాస్‌ పంపిన ఫొటోలు, ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు గుర్తించడంతో డయల్‌ 100 కు ఫోన్‌ చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 4 సెల్‌ఫోన్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు బావ శ్రీనివాస్, సోదరి లావణ్య పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. గతంలోనూ రెక్కీ నిర్వహించిన విషయమై ఇప్పటికే ఓ కేసు ఉంది. హత్యాయత్నం కోణం ఉందా..? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)