Breaking News

పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి

Published on Mon, 05/29/2023 - 11:27

గువహటి: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల ప్రకారం.. గువాహటిలోని జలూక్‌బరీ ప్రాంతంలో ఓ కారు(01 GC 8829) ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా గువాహటిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నట్లు తెలిసింది.  క్షతగాత్రులను సమీపంలోని జీఎంసీహెచ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. కారు.. వ్యాన్‌ను ఢీకొనే ముందు డివైడర్‌ను ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. 

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు.. 
- అరిందమ్ భల్లాల్
- నియోర్ దేకా
- కౌశిక్ మోహన్
- ఉపాంగ్షు శర్మ
- రాజ్‌కిరణ్ భుయాన్
- ఎమోన్ గయాన్
- కౌశిక్ బారుహ్

తీవ్రంగా గాయపడిన వారు.. 
- అర్పాన్ భుయాన్
- అర్నాబ్ చక్రవర్తి బొంగైగావ్
- మృన్మోయ్ బోరా. 

ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)