Breaking News

కస్టడీలో ఆర్‌ఐ స్వర్ణలత.. వెలుగులోకి సంచలన విషయాలు

Published on Sat, 07/15/2023 - 12:29

సాక్షి, విశాఖపట్నం: విశాఖ సిటీ ఆర్‌ఐ సీఐ స్వర్ణలత, ఆమె ముఠా కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోసం చేయాలన్న కుట్రలో భాగంగానే కరెన్సీ ఎక్చేంజ్ డ్రామా ఆడినట్లు తేలింది. కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకుంది. సినిమాలపై ఆసక్తి ఉండటమే కొంప ముంచిందని కన్నీళ్లు పెట్టుకుది.

2 వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా రిమాండ్‌లో ఉన్న స్వర్ణలతకు ఒక రోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు. క్రైమ్‌ డీసీపీ నాగన్నతోపాటు ఏసీపీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో స్వర్ణలతతోపాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్‌లో విచారించారు.

ముందుగా సీనిమా స్టోరీలు చెప్పి విచారణ అధికారులను స్వర్ణలత మభ్య పెట్టే ప్రయత్నం చేసింది. అయితే డిపార్ట్‌మెంట్లో పనిచేశారు కాబట్టి మర్యాదగా అడుగుతున్నాం.. నిజాలు చెప్పండంటూ సీనియర్‌ అధికారులు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో స్వర్ణలత, ఆమె గ్యాంగ్‌ వెల్లడించిన సమాచారంతో అధికారులు షాక్‌ అయ్యారు. 
చదవండి: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మాయా శక్తి: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

నగరంలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు నోట్లు మార్పిడికి సిద్ధంగా ఉన్నట్టు స్వర్ణలత గ్యాంగ్‌ తెలిపింది.  నేవీ ఉద్యోగులు రూ. 90 లక్షలు తెచ్చిన మాట నిజమే కానీ నగదు మార్పిడికి సంబంధించి తన వాహనంలో ఎలాంటి రూ. వేల నోట్లు తీసుకెళ్ల లేదని వెల్లడించింది. సినిమా షూటింగ్‌ సమయంలో ఏ-1 సూరి ద్వారా మరో పెద్ద వ్యక్తి పరిచయం అయ్యారని స్వర్ణలత తెలిపారు. 

ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నోట్ల మార్పిడి దందాకు సిద్ధపడినట్టు అంగీకారించారు.  అయితే సీజ్ చేసిన ఫోన్లలో డేటాను చూడొద్దని, వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్నాయని స్వర్ణలత ప్రాధేయపడ్డారు.  అయినా ఆమె అభ్యర్థనలు అధికారులు పట్టించుకోలేదు. జాలిపడితే తమ జీవితాలు కాలిపోతాయని ఉన్నతాధికారులు కఠినంగా చెప్పారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా స్వర్ణలత జైలులో ఉన్నా.. ఆమె భర్త అమెరికా నుంచి ఇండియాకు రాలేదు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో స్వర్ణలత భర్త పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు విశాఖలో చదువుతుండగా.. అతడు కూడా ఇప్పటి వరకు ఆమెను చూడటానికి రాక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)