Breaking News

మటన్ కర్రీ​ వండలేదనే కోపంతో భార్యను చంపిన భర్త

Published on Thu, 03/13/2025 - 20:24

సాక్షి,మహబూబ్‌ నగర్‌:  జిల్లాలో దారుణం జరిగింది. మటన్‌ కూర వండలేదని భార్యను కడతేర్చాడు ఓ  కసాయి భర్త.   

సీరోల్‌ ఎస్సై సీఎహెచ్‌ నాగేష్‌ వివరాల మేరకు.. సీరోల్ మండల కేంద్రానికి చెందిన ఎం కళావతి,ఎం బాలు భార్యభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బాలుకి నాన్‌ వెజ్‌ తినాలని బుద్ధి పుట్టింది. ముందుగా చికెన్‌ కూర తిందామని అనుకున్నాడు. అసలే బర్డ్‌ ఫ్లూ అంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని షాపుకెళ్లి మటన్‌ కూర తెచ్చాడు.

మటన్‌ తినాలని ఉంది. అందుకే మటన్‌ తెచ్చా. వెంటనే మటన్‌ కూర చేయమని భార్యను కోరాడు. అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో నిందితుడు బాలుకి కోపం నషాళానికి అంటింది. ఏం చేయాలే పాలుపోలేదు. పట్టరాని కోపంతో భార్య కళావతిని వెనక్కి నెట్టాడు. ఫలితంగా బాధితురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. భర్త నెట్టడంతో బాధితురాలి తలకి బలమైన గాయాలయ్యాయి. అక్కడికక్కడే మరణించింది. అనంతరం బాలు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌ నిమిత్తం మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)