Breaking News

TS: ప్రాణాలు తీస్తున్న పతంగులు!

Published on Mon, 01/15/2024 - 13:38

హైదరాబాద్‌, సాక్షి: పతంగి దారాలు పండుగ పూట ఉత్త పుణ్యానికి మనుషుల కుత్తుకలు కోస్తున్నాయి. తెలంగాణలో రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడగా.. తాజాగా సోమవారం మరో ప్రాణం పోయింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గాలిపటాలు ఎగరేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. నిషేధిత చైనా మాంజా దారం అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.  

సంక్రాంతి వేళ గాలి పటం సరదా ప్రాణాలు తీస్తోంది.  బిల్డింగ్‌పై నుంచి పడి ఇద్దరు, విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మాంజా దారం తగిలి ఆర్మీ జవాన్‌ మృతి చెందిన సంగతీ తెలిసిందే. అలా గడిచిన రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.  సోమవారం  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మరో మరణం సంభవించింది. విద్యుత్‌ తీగలకు తగిలిన పతంగి తీసే క్రమంలో 22 ఏళ్ల యువకుడికి షాక్‌ తగిలింది. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆ యువకుడు కన్నుమూశాడు. ఝరాసంగం మండలం పొట్‌పల్లిలో ఇది జరిగింది. 

వరుస ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు గాలి పటం ఎగరేసేలా చూడాలని కోరుతున్నారు. బిల్డింగ్‌లపై కాకుండా మైదానాల్లో పతంగులు ఎగరేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో.. మాంజాదారం అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్లా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి దుకాణాల్ని సీజ్‌ చేస్తున్నాయి. సరదా పేరిట పతంగులు ఎగరేస్తూ పబ్లిక్‌ న్యూసెన్స్‌కు పాల్పడ్డా కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)