Breaking News

కూకట్‌పల్లిలో భారీ చోరీ

Published on Sat, 11/30/2024 - 08:21

మూసాపేట: కూకట్‌పల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..టంగుటూరుకు చెందిన మధుసూదన్‌రావు, సంధ్యారాణి దంపతులు కూకట్‌పల్లి జయానగర్‌లోని శ్రీ సీతా ప్యాలెస్‌ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. 

కొద్దిరోజులుగా వీరు అవసరాల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నారు. గురువారం సాయంత్రం మధుసూదన్‌రావు ఇంటికి వచ్చి దుస్తులు తీసుకొని వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం డ్రైవర్‌ ఫోన్‌చేసి ఇంటి తలుపు తీసి ఉందని ఫోన్‌ చేసి చెప్పగా వెంటనే ఇంటికి వచ్చి చూసిన మధుసూదన్‌రావు దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గురువారం రాత్రి సుమారు 11.47 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మెట్ల మార్గంలో ఫ్లాట్‌లోకి వెళ్లినట్లు సీసీకెమెరాలో నమోదైంది. దొంగలు బెడ్‌రూమ్‌లోని డ్రెస్సింగ్‌ టేబుల్‌ అద్దం వెనుక ఉన్న బీరువా తాళాలు తీసుకొని..బీరువాలో ఉన్న సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 82 తులాల బంగారు నగలు, రూ.10 లక్షల విలువ చేసి డైమండ్‌ నెక్లెస్, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.

 శుక్రవారం ఉదయం 7.30 ప్రాంతంలో వాచ్‌మెన్‌ మొక్కలకు నీరు పోసేందుకు వెళ్లగా..ఫ్లాట్‌ డోర్‌ తెరిచి ఉందని గమనించి డ్రైవర్‌కు తెలియజేశాడు. వెంటనే డ్రైవర్‌ యజమానికి తెలపటంతో వారు వచ్చి చూసుకోగా బంగారు నగలు దొంగతనం అయినట్లు గమనించారు. కాగా డ్రెస్సింగ్‌ టేబుల్‌ అద్దం వెనుక ఉన్న తాళాన్ని తీసుకొని దొంగతనం చేయటంతో తెలిసిన వారి పనై ఉండవచ్చని బాధితులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)