Breaking News

విషాదాల్లోనూ వీడని రాఖీ బంధం

Published on Fri, 09/01/2023 - 03:39

తిమ్మాపూర్, ముస్తాబాద్‌(సిరిసిల్ల), నర్సాపూర్‌ రూరల్‌: సోదరీ సోదరుల ప్రేమానురాగాలు, ఆత్మీయ బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్‌ రోజున గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు, ప్రమాదాల్లో ముగ్గురు సోదరులు దుర్మరణం పాలయ్యారు. రాఖీ కడదామని ఆనందంగా పుట్టింటికి వచ్చిన చెల్లెళ్లకు అన్నల మృతి తీరని శోకాన్ని మిగల్చగా.. అంతటి విషాదంలోనూ చివరిగా మృతదేహాలకు రాఖీ కట్టి సోదరులపై తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు.

రాఖీ కట్టేందుకు తన ఇద్దరు చెల్లెళ్లు వస్తున్నారని తెలిసి పొలం నుంచి స్కూటీపై ఇంటికి బయలుదేరిన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన పోచమల్లు యాదవ్‌ (43)ను రాజీవ్‌ రహదారిపై హైదరాబాద్‌ వైపు నుంచి కరీంనగర్‌ వస్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మరణవార్త విని చెల్లెళ్లు బోరున విలపిస్తూ ఇంటికి వచ్చి శవానికి చివరిసారిగా రాఖీ కట్టారు. 

చివరిసారి రాఖీ కడుతున్నా.. లేరా తమ్మీ.. 
‘లేరా తమ్మీ.. రాఖీ కట్టేందుకు వచ్చిన.. ఒక్కసారి చూడురా.. ఇది నీకు కట్టే చివరి రాఖీరా తమ్మీ..’అంటూ తమ్ముడి మృతదేహంపై పడి సోదరి గుండెలవిసేలా రోదించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ముస్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన కౌలురైతు అనమేని నర్సింలు(37) బుధవారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.

గురువారం మధ్యాహ్నం తరువాత బావిలో పడ్డట్లు గుర్తించి మృతదేహాన్ని బయటికి తీశారు. గంభీరావుపేట మండలం నర్మాలలో ఉండే సోదరి రాజవ్వకు ఈ విషయం తెలియక తన తమ్ముడు నర్సింలుకు రాఖీ కట్టేందుకు గురువారం ఉదయమే ముస్తాబాద్‌కు వచ్చింది. నర్సింలు బావిలో గల్లంతయ్యాడని తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. 

రాఖీ కడదామని వచ్చి అంత్యక్రియల్లో.. 
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం అవంచ గ్రామానికి చెందిన కొండి జగన్‌(45)కు నర్సమ్మ, అంబిక ఇద్దరు చెల్లెళ్లు. రాఖీ పండుగ సందర్భంగా వారిద్దరూ పుట్టింటికి వచ్చారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్‌ గురువారమే మృతి చెందడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాఖీ కడదామని వస్తే అన్న అంత్యక్రియలు చే

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)