Breaking News

దారుణానికి ఒడిగట్టిన ఇస్రో మాజీ సైంటిస్ట్‌

Published on Wed, 02/18/2026 - 22:30

బెంగళూరు: డిప్రెషన్‌. ఈ డిప్రెషన్‌లో తాను మరణిస్తే.. తన భార్య ఒంటరైపోతుందని, ఆమెను చూసుకునేవారు ఎవరూ ఉండరని భావించిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.   

ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. మాజీ ఇస్రో ఉద్యోగి నాగేశ్వరరావు (65) తన భార్య సంధ్య శ్రీ (60)ను వారి నివాసంలో తువ్వాలతో గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

అయితే సాధ్యం కాలేదు. ఘటన అనంతరం నాగేశ్వరరావు  తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు.  అప్రమత్తమైన ఆ వ్యక్తి వెంటనే అవలహಳ್ಳಿ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంధ్య శ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ప్రాథమిక దర్యాప్తులో నాగేశ్వరరావు తన భార్యను తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. భార్య భవిష్యత్తుపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తేలింది. సంధ్య శ్రీ కూడా ఇస్రోలో పనిచేశారు. ఈ దంపతులకు అమెరికాలో స్థిరపడిన ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు ఈ ఘటన గురించి సమాచారం అందించబడింది. ప్రస్తుతం నాగేశ్వరరావుపై హత్య కేసు నమోదు చేసి, అతని మానసిక స్థితి, వైద్య చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)