Breaking News

7 ఏళ్ల బాలికను 4.5 లక్షలకు కొని.. ఆపై ఊరికి దూరంగా తీసుకెళ్లి

Published on Wed, 05/24/2023 - 16:46

జైపూర్‌: వందల ఏళ్ల క్రితం బాల్య వివాహాలు, ముసలివాళ్లు బాలికను వివాహం చేసుకోవడం వంటి దారుణాలు జరిగేవి. ప్రస్తుతం ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అడపాతడపా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా మానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 7 మైనర్‌ బాలికను మధ్య వయస్కుడైన 38 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం... ఏడు సంవత్సరాల వయసున్న బాలికను మధ్యవయస్కుడైన వ్యక్తి కొనుగోలు చేసి ఆపై వివాహం చేసుకున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు బృందంగా ఏర్పడి బాలిక ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. అయితే వాళ్లు ఊరి బయట నిర్జన ప్రదేశంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించగానే మెహెందీ చేతులకు పూసుకుని, పాదాల మీద పారణి పూసుకుని అమాయకత్వంతో ఆ బాలిక ఆడుకుంటూ కనిపించింది.

పోలీసులు బాలికను విచారించే ప్రయత్నం చేసినా ఆమె ఏమీ చెప్పలేకపోయింది. నిందితుడిని విచారించగా 4.50 లక్షలు ఆమె తండ్రికి చెల్లించి బాలికను కొనుగోలు చేసినట్లు అతను ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారు, ఎంత మంది ప్రమేయం ఉందనే దానిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: Hyderabad: మొండెం లేని మహిళ తల ఎవరిదో తెలిసింది

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)