Breaking News

బాలికను వేధించాడని.. రైల్వే ఉద్యోగిపై ప్రయాణికుల దాష్టీకం

Published on Fri, 09/13/2024 - 20:05

న్యూఢిల్లీ: రైలులో మైనర్‌ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. ఈ ఘటన హమ్‌సఫర్‌ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. బిహార్‌లోని సివాన్‌కుచెందిన కుటుంబం బుధవారం న్యూఢిల్లీకి వెళ్తున్న హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. రైలులోని థర్డ్‌ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు.

అయితే రాత్రి 11.30 గంటలల సమయంలో సమయంలో అయితే అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న గ్రూప్‌ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్‌ కుమార్‌ .. కుటుంబంలోని 11 ఏళ్ల భాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. తర్వాత బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా.. చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు

మహిళ వాష్‌రూమ్ నుంచి తిరిగి రాగానే, బాలిక తల్లి వద్దకు పరిగెత్తి, ఆమెను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. తల్లిని వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్‌ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్‌లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. రైలు లక్నోలోని ఐష్‌బాగ్‌ జంక్షన్‌కు చేరుకోవడంతోదీంతో అతడ్ని ఆ కోచ్ డోర్‌ వద్దకు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కదులుతున్న రైలులోనే గంటన్నరపాటు నిందితుడిని కొట్టారు.

అనంతరం రైలు ఉదయం 4.35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్‌లోని  కాన్పూర్‌ సెంట్రల్‌ చేరుకోగా.. నిందితుడుని రైల్వే పోలీసు అధికారులు అప్పగించారు.  బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిని ప్రశాంత్‌ కుమార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిది బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలోని సమస్త్‌పూర్‌ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.

అయితే బాలిక కుటుంబం, ఇతర ప్రయాణికులు కుట్రతో ప్రశాంత్‌ కుమార్‌ను హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)