Breaking News

చిన్న వివాదం.. ఆ డీఎస్పీ ప్రాణం తీసింది!

Published on Thu, 01/04/2024 - 21:25

ఛండీగఢ్‌: చిన్న వివాదం పంజాబ్‌లో ఓ పోలీస్‌ ఉన్నతాధికారి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఓ ఆటోడ్రైవర్‌తో గొడవ కారణంగానే ఆయన ప్రాణం పోయింది. అయితే.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు జలంధర్‌ పోలీసులు. 

అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి(డీఎస్పీ స్థాయి) దల్బీర్‌ సింగ్‌ డియోల్‌‌ (54)హత్యకు గురికావడం పంజాబ్‌లో అలజడి రేపింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓ ఆటో డ్రైవర్‌ అని, అతనితో దల్బీర్‌ వాగ్వాదానికి దిగడమే హత్యకు కారణమైందని చివరకు పోలీసులు నిర్ధారించారు. 

ఏం జరిగిందంటే..
దల్బీర్‌ సింగ్‌ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ బయటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో తనను ఇంటి దగ్గర దింపాలని సదరు ఆటో డ్రైవర్‌ను కోరారు. అందుకు డ్రైవర్‌ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణగా మారే క్రమంలో..  దల్బీర్‌ దగ్గర ఉన్న సర్వీస్‌ తుపాకీని లాక్కుని ఆ డ్రైవర్‌ కాల్పులు జరిపాడు. దాంతో దల్బీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

ఆపై జలంధర్‌ నగర శివారులో ఓ కాలువ సమీపంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు జుగల్‌ కిషోర్‌ అనే పోలీసాధికారి ఆ మృతదేహాన్ని మొదటగా గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు మొదలైంది. 

ఛేదించారిలా.. 
ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. ఓ ఆటోను గుర్తించారు. దాని నెంబర్‌ ప్లేట్‌ ఆధారంగా.. అక్కడి నుంచి ఉన్న మూడు దారుల్లో ట్రేస్‌ చేసే యత్నం చేశారు. అదే సమయంలో ఆ కాలువకు దగ్గర్లోని టవర్‌కు వచ్చిన మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగానూ సమాంతరంగా దర్యాప్తు కొనసాగించారు. చివరకు నిందితుడిని ఆటో డ్రైవర్‌ విజయ్‌ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

గతంలో ఆసియా క్రీడల్లో దల్బీర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని సాధించారు. అందుకే 2000లో ఆయనను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. అనంతరం ఆయన పోలీసుశాఖలో చేరారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)