Breaking News

సైకో కిల్లర్‌ అరెస్టు

Published on Sat, 12/09/2023 - 04:37

తాండూరు టౌన్‌: ఏడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ సైకో కిల్లర్‌ను తాండూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళా అడ్డా కూలీలే అతని టార్గెట్‌. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు, నగదుతో పరారయ్యేవాడు. తాజాగా తాండూరు పట్టణంలో ఓ మహిళా కూలీ అదృశ్యం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. తాండూరు డీఎస్పీ శేఖర్‌ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి శుక్రవారం ఆ వివరాలు వెల్లడించారు.

కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మడ్కల్‌ గ్రామానికి చెందిన సర్వాబి(42) తన భర్తతో కలిసి తాండూరు పట్టణంలోని ధన్‌గర్‌ గల్లీలో నివాసం ఉంటూ కూలి పనిచేస్తుండేది. గత నెల 29న పని నిమిత్తం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో భర్త మహ్మద్‌ ఈ నెల 1న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా స్థానిక శాంత్‌మహల్‌ చౌరస్తా నుంచి సర్వాబి, ఓ వ్యక్తితో కలిసి ఇందిరాచౌక్‌ వెళ్తున్నట్లు గుర్తించారు.

ఆ వ్యక్తి వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం అల్లీపూర్‌ గ్రామానికి చెందిన కూలి పనిచేసే మాల కిష్టప్పగా(50) పోలీసులు గుర్తించారు. గురువారం అదుపులోకి తీసుకుని కిష్టప్పను విచారించగా తానే హత్య చేశానని చెప్పడంతో, ఘటనా స్థలానికి నిందితున్ని తీసుకెళ్లి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు.

రెండు నెలల క్రితమే జైలు నుంచి బయటికొచ్చి..
గత నెల 29న సర్వాబికి మాయమాటలు చెప్పి తట్టేపల్లి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి ఆమె కొంగుతోనే మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.1000 నగదు, కాళ్ల పట్టీలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితునిపై వికారాబాద్‌ పీఎస్‌లో 4 కేసులు, ధారూరులో ఒకటి, యాలాలలో ఒక హత్య కేసు నమోదైంది. తాజాగా పట్టణంలో మరో కేసు నమోదు చేశారు. ఓ కేసులో 2021 నుంచి జైలులో ఉన్న కిష్టప్ప రెండు నెలల క్రితమే బయటకు వచ్చి సర్వాబిని హత్య చేశాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)