Breaking News

తెలుగు రాష్ట్రాల్లో డెత్‌ ట్రావెల్స్‌

Published on Thu, 05/23/2024 - 07:07

కర్నూలు, నిర్మల్‌/సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఎక్కువ ట్రిప్పుల కోసం వేగంగా.. నిరక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణలో రెండు వేర్వేరు ప్రమాదాలు జరగ్గా.. ముగ్గురి ప్రాణాలు పోయాయి. గాయపడిన వాళ్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

గురువారం వేకువ ఝామున ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అదే సమయంలో నిర్మల్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  

కర్నూల్‌ జిల్లా కోడుమూరు  సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులోని 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. పోలీసులు స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి.. చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బిస్మిల్లా ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుండి ఆదోనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుల్ని హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి(13), గోవర్థిని(8)గా పోలీసులు నిర్ధారించారు.

ఇక.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ పై ముస్కాన్‌ ప్రైవేట్ బస్సు ఒకటి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో 25 మందికి గాయాలు కాగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. పది మందిని నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. బస్సు ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోందని.. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)