Breaking News

ప్రైవేటు టీచర్‌ అదృశ్యం.. చివరిసారి కాల్‌ చేసిన యువకుడు

Published on Wed, 01/24/2024 - 11:48

కర్ణాటక: మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకా మేలుకోటె దగ్గర మాణిక్యనహళ్ళికి చెందిన వి. దీపిక గౌడ (28) అనే ప్రైవేటు స్కూలు టీచర్‌ అదృశ్యమై, ఆపై హత్యకు గురికావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.  మేలుకోటెలో ప్రసిద్ధ యోగ నరసింహ స్వామి కొండ కింద పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం సోమవారం సాయంత్రం బయటపడింది.

ఫోన్‌ రాగానే స్కూలు నుంచి వెళ్లి..  
వివరాలు.. మానిక్యనహళ్ళిలో వెంకటేష్‌ కుమార్తె అయిన దీపికకు అదే గ్రామానికి చెందిన లోకేష్‌ అనే యువకునితో పెళ్లయింది, వారికి 8 ఏళ్ల కూతురు ఉంది. మేలుకోటెలోని ఎస్‌ఈటి పబ్లిక్‌ స్కూల్‌లో టీచర్‌గా ఆమె పనిచేసేది. గ్రామం నుంచి రోజూ తన డియో స్కూటర్‌లో స్కూలుకు వెళ్లి వచ్చేది. ఈ నెల 20వ తేదీన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్కూలు అయిపోగానే ఆమెకు ఒక ఫోన్‌ కాల్‌ రావడంతో స్కూటర్‌లో వెళ్లిపోయింది. 

అప్పటినుంచి ఆమె జాడ లేదు. ఆమె శవం దొరికిన చోటుకు కొంతదూరంలో స్కూటర్‌ పార్క్‌ చేసింది. సోమవారం కూడా  స్కూటర్‌ అక్కడే ఉండడం చూసి స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి స్కూటర్‌ వివరాలను బట్టి దీపకదిగా గుర్తించి ఆమె తండ్రి వెంకటే‹Ùను కలిసి మాట్లాడారు. ఈ నెల 20వ తేదీనే తమ కూతురు మిస్సింగ్‌ అని మేలుకోటె పీఎస్‌లో ఫిర్యాదు చేశానని ఆయన చెప్పాడు. చివరకు స్కూటర్‌ చుట్టుపక్కల ప్రజలతో కలిసి గాలించగా పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం లభ్యమైంది.   

టిక్‌టాక్‌ వీడియోలు  
దీపిక సినిమా హీరోయిన్‌కు తీసిపోని అందంతో ఆకట్టుకునేది. ఇన్‌స్టా, యూట్యూబ్‌తో పాటు గతంలో టిక్‌టాక్‌లో సినిమా పాటలు, డైలాగుల వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఉండేది. ఆమెకు ఎంతోమంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. దీంతో ఆమె టిక్‌టాక్‌ దీపికగా స్థానికంగా ఎంతో పేరుపొందింది.  

పరారీలో యువకుడు  
పోలీసులు మృతదేహాన్ని వెలిసితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శవంపై ఎలాంటి గాయాలు లేవని, ఎవరో దుండగులు చంపి పూడ్చిపెట్టారని తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు పోలీస్‌ బృందాలు ఏర్పాటయ్యాయి. ఆమెకు చివరిసారి కాల్‌ చేసింది నితిన్‌ అనే యువకుడు అని, అతడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)