Breaking News

ఆధిపత్యం కోసమే అంతమొందించారు

Published on Mon, 12/02/2024 - 05:24

నెల్లూరు (క్రైమ్‌): ఆధిపత్యం, పాత కక్షల నేపథ్యంతోనే హిజ్రా సంఘ నాయకురాలు మానికల హాసిని హత్య జరిగినట్లు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ చెప్పారు. ఈ కేసులోని 15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్ట్‌ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నెల్లూరు ఉమేష్‌ చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్‌లో హాసిని హత్యకు దారి తీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను ఎస్పీ ఆదివారం వివరించారు.

తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరుకి చెందిన హాసిని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటుగా కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్, ధార్వాడ్, చిక్‌మగ్‌­ళూరు, హుబ్లీ జిల్లాల్లోని ట్రాన్స్‌జెండర్లకు నాయకురాలు. నెల్లూరు జిల్లాకు చెందిన హిజ్రా సంఘ మాజీ నాయకురాలు అలేఖ్య అలియాస్‌ అనిల్‌కుమార్‌కు హాసిని మధ్య విభేదాలున్నాయి. ఇద్దరి మీద నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలు కేసులున్నాయి. హాసినికి బోడిగాడితోటకు చెందిన షీలా, సులోచనతోనూ విబేధాలున్నాయి. ఇవి తారస్థాయికి చేరుకోవడంతో హాసినిని అంతమొందించాలని వీరందరూ నిర్ణయించుకుని సుందరయ్యకాలనీకి చెందిన రౌడీషిటర్‌ చింతల భూపతిని,నెల్లూరు రూరల్‌ మండలానికి చెందిన మరో రౌడీషిటర్‌ను సంప్రదించారు.

వీరి ద్వారా కొందరిని సమీకరించుకుని సుపారీ ఇచ్చి అదను కోసం వేచి చూడసాగారు. గత నెల 26న రాత్రి హాసినిని టపాతోపు రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద నిందితులు హత్య చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి  నిందితులను గుర్తించారు. కోవూరు అండర్‌ బ్రిడ్జి వద్ద కార్లలో వెళ్తున్న నిందితులైన రౌడీషిటర్‌ వంశీకృష్ణ అలియాస్‌ నాని, రాము, కార్తీక్, సుబ్రహ్మణ్యం, షేక్‌ మస్తాన్‌ వలీ అలియాస్‌ వలీ, వెంకటాద్రి, రాజే‹Ù, వంశీ, షీలా అలియాస్‌ శ్రీనివాసులు, అలేఖ్య అలియాస్‌ అనిల్‌ కుమార్, చింతల భూపతి, ఓ బాలుడిని అరెస్ట్‌ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)