Breaking News

ఎలుకను చంపిన వ్యక్తిపై కేసు, 30 పేజీల చార్జిషీట్‌.. 3 ఏళ్లు జైలు శిక్ష?

Published on Wed, 04/12/2023 - 16:18

లక్నో: ఎలుకను చంపినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు 30 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. మనోజ్‌ కుమార్‌ ఓ  ఎలుకను చిత్ర హింసలు పెడుతూ ఉండగా.. జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ ఈ మొత్తం ఘటనను చిత్రీకరించి నిందితుడు మనోజ్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విచిత్రమైన ఘటన తెరపైకి వచ్చింది. ఎలుక పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించారు.

శర్మ ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించగా అది ఊపిరాడక చనిపోయిందని తెలిపాడు. ​కాగా మనోజ్‌పై జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం, జంతువులను చంపడం లేదా గాయపరచడం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, మీడియాలో విడుదలైన వీడియోలు, సంబంధిత వివిధ విభాగాల నిపుణుల అభిప్రాయాలతో సహా 30 పేజీల ఛార్జిషీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు.  పోలీసులు ఎలుక మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)కి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. వాపు కారణంగా ఎలుక ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, లివర్ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని చార్జిషీట్‌లో స్పష్టం చేశారు. అంతే కాకుండా మైక్రోస్కోపిక్ పరీక్షలో కూడా ఊపిరాడక ఎలుక చనిపోయిందని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అటవీ శాఖ చట్టం ప్రకారం... ఎలుకను చంపడం నేరంగా పరిగణించబడదని బుదౌన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందున చర్యలు తీసుకోవాల్సి ఉందని డిఎఫ్‌ఓ తెలిపారు.

 ఏ శిక్ష పడే అవకాశం ఉంది!
జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో రూ.10 నుంచి రూ.2000 వరకు జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, మనోజ్ తండ్రి మధుర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎలుకను, కాకిని చంపడం తప్పుకాదని, అవి హానికర జీవులని, అలాంటి కేసులో మా కుమారుడికి శిక్ష పడితే కోళ్లు, మేకలు, మేకలను చంపే వారందరిపైనా చర్యలు తీసుకోవాలి. చేపలు, ఎలుకలను చంపే మందులను విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)