Breaking News

బీఆర్‌ఎస్‌ నేత జోగినపల్లి సంతోష్‌పై కేసు

Published on Sun, 03/24/2024 - 16:06

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు నమోదైంది. నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ రోడ్‌నం.14లో భూకబ్జా చేశారంటూ కేసు నమోదు అయ్యింది. ఫోర్జరీ డ్యాకుమెంట్లతో భూ కబ్జాకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు.

నవయుగ కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌తో పాటు మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నంబర్‌ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేయగా, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈనెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 400, 471, 447, 120బి రెడ్‌విత్ 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు: సంతోష్‌
తనపై చేసిన భూకబ్జా ఆరోపణలు అవాస్తవమని జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం 2016లో పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. రూ. 3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి, బాజాప్తా సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో  కొనుగోలు చేశాను. ఫోర్జరీ అనే మాటకు తావులేదు. అది వాస్తవం కాదు. ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయ వివాదం తలెత్తలేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయి’’ అని సంతోష్‌ వివరణ ఇచ్చారు.

‘‘ఆ స్థలం గడిచిన 32 సంవత్సరాలుగా నాకు అమ్మిన వ్యక్తి,  నా ఆధీనంలోనే ఉంది. ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా నాకు లీగల్ నోటీసు ఇవ్వాలి వివరణ అడగాలి. కానీ అలాంటివేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు’’ అని సంతోష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: కేజ్రీవాల్, కవితల అరెస్ట్‌ ప్లాన్‌ ప్రకారమే జరిగిందా?

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)