Breaking News

రూ.2 వేల నోట్ల మార్పిడి పేరిట టోకరా

Published on Tue, 06/06/2023 - 07:33

సాక్షి,దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ నగరంలో రూ.2 వేల నోట్ల మార్పిడి పేరిట రూ.60 లక్షలతో ఉడాయించిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీ­యవర్గాల సమాచారం ప్రకారం.. విశాఖకు చెందిన ధర్మరాజు అనే వ్యక్తి రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2 వేల నోట్లు ఇస్తామంటూ తనకు తెలిసిన వారిని నమ్మించాడు. విషయం తెలుసుకున్న భీమిలికి చెందిన ఎం.రామా­రావు అనే వ్యక్తి తన స్నేహితుల ద్వారా విజయవాడ నుంచి రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు తెప్పించారు.

వాటిని భీమిలికి చెందిన కొయ్య అప్పలరెడ్డి సహాయంతో శనివారం సాయంత్రం గొల్లలపాలెం ఎస్‌బీఐ బ్యాంక్‌ వద్దకు వెళ్లి.. అప్పటికే అక్కడకు చేరు­కున్న ధర్మరాజు, అతని స్నేహితులు కాకినా­డకు చెందిన ఎండీ అహ్మద్, సునీల్‌ అలియాస్‌ చిన్నాను కలిశారు. నగదు మారుస్తామని చెప్పిన ధర్మరాజు, అతని స్నేహితులు అహ్మద్, సునీల్‌ కలిసి రామారావు నుంచి రూ.60 లక్షలు తీసుకుని మోటార్‌ సైకిల్‌పై ఉడాయించారు.

వారి కోసం వెతికినా కనిపించకపోవడం, ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి రామారావు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు గంట వ్యవధిలోనే ధర్మరాజుతో పాటు అతని గ్యాంగ్‌ను అదుపు­లోకి తీసుకుని రూ.60 లక్షలు రికవరీ చేశారు. ఈ గ్యాంగ్‌ వెనుక ఉన్న సూత్రధారు­లెవరు, ఎంతమందిని మోసం చేశారనే విషయాలపై పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే తరహాలో రాజమండ్రిలో కూడా ఒక కేసు నమోదైనట్టు తెలుస్తోంది.

చదవండి: Tanguturi Prakasam Pantulu: పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం.. పూలకు బదులు పండ్లు తెస్తే తినేవాడినంటూ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)