Breaking News

నగదు అక్రమ రవాణాపైనా సిట్‌ నజర్‌!

Published on Fri, 04/12/2024 - 04:51

సాక్షి, హైదరాబాద్‌: గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్‌ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే సిట్‌ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు.

ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌ టాస్‌్కఫోర్స్‌ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలు, సూచనల మేరకు పోలీసు బృందాలు ప్రతిపక్షాలకు చెందినవిగా అనుమానిస్తూ భారీ మొత్తంలో నగదు స్వా«దీనం చేసుకున్నాయి. విపక్షాల నగదుకు సంబంధించిన సమాచారం వారికి ట్యాపింగ్‌ ద్వారానే తెలిసినట్లు వెల్లడైంది. మరోపక్క ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు పోలీసులే తమ వాహనాల్లో కొందరు అభ్యర్థులకు సంబంధించిన నగదును తరలించినట్లు సిట్‌ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీనిపై ఆరా తీసిన పోలీ సులు ఆ నగదు మూలం, చేరిన ప్రాంతం తదితరాలు గుర్తించారు.

ఎలక్షన్‌ సమయంలో తనిఖీలు ముమ్మరంగా ఉంటాయి. దీంతో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులు ఏర్పాటు చేసిన బృందాలు కొన్ని బడా సంస్థలతో పాటు వ్యాపారవేత్తలకు చెందిన నగదును పోలీసు వాహనాల్లో రవాణా చేసినట్లు అధికారులు తేల్చారు. టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఐబీ వాహనాల్లో రవాణా అయిన ఈ నగదు కొందరు నేతలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. సిట్‌ అధికారులు ఇప్పటికే ఆయా నగదు, అక్రమ రవాణా వాహనాల్లో ప్రయాణించిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు డ్రైవర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు.  

2018 నుంచి.. గత ఏడాది డిసెంబర్‌ వరకు.. 
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్‌ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. పోలీసు కస్టడీ నేపథ్యంలో సిట్‌ అధికారులు రాధా కిషన్‌రావును ఈ నగదు అక్రమ రవాణా పైనా ప్రశ్నించారు.

అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. ఇప్పటికే ఈ నగదు అక్రమ రవాణాపై కీలక సమాచారం సేకరించిన అధికారులు రాధాకిషన్‌రావు సహా మరికొందరిపై మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. గురువారం నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీరాలం ఈద్గా వద్ద మీడియాతో మాట్లాడుతూ, ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)