Breaking News

గంజాయి సరఫరా చేస్తున్న ఫార్మసిస్ట్‌ అరెస్టు

Published on Wed, 11/20/2024 - 05:36

ఆరిలోవ: విశాఖ కేంద్రకారాగా­రంలో ఖైదీ­లకు గంజాయి సరఫరా చేసే యత్నంలో ఓ ఉద్యో­గి అధికారులకు చిక్కాడు. జైలు సిబ్బంది తనిఖీల్లో ఈ వ్యవ­హారం బయట­పడింది. జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.కిశో­ర్‌­కుమార్‌ వివరాలు ప్రకారం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాస్‌ ఫార్మసిస్ట్‌గా ఏడాది నుంచి డిప్యుటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారం ఆస్పత్రిలో పని­చేస్తున్నారు. ఈ జైలుకు సంబంధించి ప్రత్యే­కంగా నియ­మిం­చిన వైద్యులు, ఫార్మ­సిస్టులు లేకపోవ­డంతో డిప్యూటేష­న్‌పై వచ్చినవారే పనిచే­యాల్సి ఉంటుంది.

శ్రీని­వాస్‌ మంగళ­వారం డ్యూటీకి వచ్చేట­ప్పుడు భోజనం క్యారేజీ తీసుకొచ్చారు. అందులో గంజాయి ఉన్నట్లు జైలు ప్రధాన ద్వారం­వద్ద  సిబ్బంది తనిఖీల్లో బయట­పడింది. ప్రధాన ద్వారం సెక్యూరిటీ సిబ్బంది జైలులో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకల సమయంలో తని­ఖీలు చేస్తుంటారు. దీన్లోభాగంగా చేపట్టిన తనిఖీల్లోనే శ్రీని వాస్‌ క్యారేజీలో 90 గ్రా­ముల గంజాయి పట్టు­బడింది. దీంతో శ్రీనివాస్‌పై ఆరి­లోవ పోలీసులకు సూపరింటెండెంట్‌ ఫిర్యాదు చేశారు. గంజాయి స్వాధీనం చేసు­కుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆరి­లోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రిమాండ్‌పై సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)