Breaking News

ఇంటర్‌ విద్యార్థినిపై లైంగిక దాడి..

Published on Tue, 04/25/2023 - 11:58

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోరం వెలుగుచూసింది. ఇంటర్‌ విద్యార్థినిపై చర్చి పాస్టర్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెరంబులూరు జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఘాయిత్యానికి పాల్పడిన చర్చి పాస్టర్, అతని బంధువును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పెరంబలూరు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన కుటుంబం కోనేరి పాలయం చర్చి పాస్టరు వేలాయుధం అలియాస్‌ స్టీఫెన్‌ (53) ఇంటిలో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో ప్లస్‌ వన్‌ విద్యార్థిని(16)పై ఎనిమిది నెలల క్రితం చర్చి పాస్టరు వేలాయుధం అలియాస్‌ స్టీఫెన్‌ లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని బాలిక  తండ్రికి చెప్పడంతో ఆయన ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. తర్వాత ఆమెను తన అమ్మమ్మ, తాతయ్య ఇంటికి పంపించేశాడు. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన బాలిక మామ కుమారుడు కూడా అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లి ఇష్టం లేని మైనర్‌ బాలిక తనకు జరిగిన అన్యాయం గురించి చిన్నారుల సంక్షేమ కార్యాలయ అధికారికి సమాచారం అందించింది.

వెంటనే వారు పెరంబలూర్‌ మహిళా పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్‌ కళ.. పాస్టర్‌ వేలాయుధం స్టీఫన్, విద్యార్థిని తండ్రి, మామ కుమారుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వేలాయుధం స్టీఫెన్, విద్యార్థిని మామ కుమారుడిని ఆదివారం అరెస్టు చేసి తిరుచ్చి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)