Breaking News

ఘోరం: కేన్సర్‌ చిన్నారిని గంగలో ముంచి..

Published on Thu, 01/25/2024 - 09:25

నమ్మకం మనిషి ఎదుగుదలకు సాయపడాలే తప్ప ప్రాణాల మీదకు తీసుకురాకూడదు. ప్రస్తుత సమాజంలో నమ్మకాలను మూడనమ్మకాలుగా మార్చుతున్నారు. విశ్వాసాల పేరుతో మానవత్వాన్ని మరచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తమతోపాటు ఇతురల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మూఢ నమ్మకం పేరుతో జరిగిన అలాంటి ఓ అమానవీయ ఘటనే తాజాగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వెలుగుచూసింది. అనారోగ్యం బారిన పడిన కొడుకుని నయం చేసేందుకు తల్లిందండ్రులు చేసిన ప్రయత్నం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. 

ఢిల్లీకి చెందిన కుటుంబంలో అయిదేళ్ల చిన్నారి బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లాడి తల్లిదండ్రులు మూఢ విశ్వాసాలను నమ్మి పిల్లవాడిని హరిద్వార్‌ తీసుకెళ్లలనుకున్నారు. అక్కడి గంగ నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఏదో అద్భుతం జరిగి బాలుడి ఆరోగ్యం కుదుటపడుందని గుడ్డిగా విశ్వసించారు. అనుకున్నది పనిగా బుధవారం ఢిల్లీ నుంచి ట్యాక్సీలో బయల్దేరారు. అప్పటికే అస్వస్థతకు గురైన బాలుడు.. హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది.
చదవండి:మార్కులు తక్కువ వచ్చాయని... 

హరిద్వార్‌లోని హర్‌కీ పౌరికి వద్దకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు వాగు ఒడ్డున మంత్రాలు పఠించారు. పిల్లవాడిని గంగనాదిలో స్నానం చేయించేందుకు నీటిలో ముంచారు. పసివాడు భయంతో ఏడుస్తూ గట్టి అరిచినా పట్టించుకోకుండా గంగంలో పదేపదే ముంచాడు. బాధతో కొడుకు అల్లాడుతుంటే ఆ తల్లి మాత్రం వెకిలి నవ్వుతో ‘ నా పిల్లవాడు లేచి నిలబడతాడు.. అది నా వాగ్దానం’ అంటూ చెబుతోంది. చివరికి ఊపిరాడక చిన్నారి నీటిలోనే చనిపోయాడు. 

ఈ దృశ్యాలను ఘాట్‌కు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో రికార్డ్‌ చేశాడు. అనంతరం అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఘాట్‌ వద్దకు చేరుకునేసరికి పిల్లవాడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, అత్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు హర్‌ కీ పైరీ ఎస్‌హెచ్‌ భావన కైంతోలా  తెలిపారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)