Breaking News

సర్పంచ్‌ కుమారుడి కారు ధ్వంసం

Published on Sat, 06/22/2024 - 04:52

రామవరప్పాడు: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడు సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత వరి శ్రీదేవి కుమారుడి కారును గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈనెల 5వ తేదీరాత్రి ప్రసాదంపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కొమ్మా కోట్లు కారు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వైఎస్సార్‌ సీపీ నాయకులను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నాయకులు ఇటువంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. వైఎస్సార్‌ సీపీకి చెందిన రామవరప్పాడు గ్రామ సర్పంచ్‌ వరి శ్రీదేవి కుమారుడు గణేష్‌ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటు­న్నారు. ఇటీవల రామవరప్పాడుకు తన కుటుంబంతో కలిసి కారులో వచ్చా­రు. తన కారును రైవస్‌ కాలువ వంతెన సమీపంలోని  కృష్ణుడి బాల ఆల­యం (కోర్టులో వేయడంతో నిర్మాణం ఆగింది) వద్ద పార్కింగ్‌ చేశాడు. 

గురు­వారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దా­లు ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా కృష్ణుడి బాల ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించారు. తెల్లారిన తర్వాత కారుపై దాడి విషయాన్ని గమనించి పటమట పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనలు బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏమిటని ప్రశి్నస్తున్నారు. పటమట సీఐ మోహన్‌రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా ఫోన్‌కు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)