Breaking News

పరామర్శకు వెళ్తే పొడిచేశాడు..

Published on Tue, 08/15/2023 - 12:41

సాలూరు: గాయాలపాలైన స్నేహితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన ఓ మహిళపై దాడి జరిగిన సంఘటన సాలూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు కిరణ్మయి, తండ్రి ఈశ్వరరావు, స్థానికులు తెలియజేసిన వివరాల మేరకు... పట్టణంలోని చిట్లువీధిలో నివసిస్తున్న లలితకుమారి రామభద్రపురం మండలం తారాపురం యూపీ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తోంది.

ఆమెకు భర్త ప్రసాద్‌తో విభేదాలుండడంతో ఇరు కుటుంబాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇటీవల లలితకుమారిపై ప్రసాద్‌ దాడిచేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న కిరణ్మయి స్నేహితురాలిని పరామర్శించేందుకు సోమవారం లలితకుమారి ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో లలితకుమారి భర్త ప్రసాద్‌ రావడంతో అతనికి, కిరణ్మయికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో సహనం కోల్పోయిన ప్రసాద్‌ కిరణ్మయి పొట్టపై కత్తితో దాడి చేసాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన కిరణ్మయిని స్థానికులు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. పట్టణ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)