Breaking News

హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష

Published on Sat, 12/21/2024 - 08:37

కాచిగూడ: నలుగురిని పెట్రోల్‌ పోసి చంపిన కేసులో ఒకరికి మరణ శిక్ష, మరో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ నాంపల్లి అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి వినోద్‌ కుమార్‌ తీర్పు వెలువరించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 2022లో రాగుల సాయి అనే వ్యక్తి తన మాజీ భార్య ఆర్తికి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. రాగుల సాయి స్నేహితుడైన నాగరాజును ఆర్తి రెండో వివాహం చేసుకుంది. 

కొన్నాళ్ల తర్వాత నాగరాజు ఆర్తిని వేధింపులకు గురి చేసేవాడు. ఆర్తిని చెల్లిగా పిలవాలని  నాగరాజు స్నేహితుడైన రాగుల సాయికి తెలపడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిని మనసులో పెట్టుకున్న రాగుల సాయి తన స్నేహితుడు ఎ.రాహుల్‌ ఇద్దరూ కలిసి గర్భంతో ఉన్న ఆర్తిని, నాగరాజును, వీరి ఏడాది కుమారుడు విష్ణుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్‌మెంట్స్‌ నారాయణగూడ పోలీసులు రికార్డ్‌ చేసుకొని కేసు నమోదు చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆర్తి, నాగరాజు, వీరి ఏడాది కుమారుడు విష్ణు, ఆర్తి కడుపులోని బిడ్డతో సహా నలుగురూ మృతి చెందారు. 

అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న నారాయగూడ పోలీసులు దర్యాప్తు సాగించారు. మొదటి ప్రాధాన్యతగా ఈ కేసుగా తీసుకున్న నాంపల్లి క్రిమినల్‌ కోర్టు జడ్జి వినోద్‌ కుమార్‌ శుక్రవారం నిందితుడైన రాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడైన రాహుల్‌కు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ యు.చంద్రశేఖర్‌ తెలిపారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)