Breaking News

Hyderabad: ప్రమాద భయం వెంటాడింది.. ప్రాణాలను బలిగొంది

Published on Wed, 04/03/2024 - 07:23

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదానికి కారణమయ్యానని భయాందోళనకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్యహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం ఎల్‌బీనగర్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన గుమ్మడి రితీష్‌ రెడ్డి (30) వృత్తిరీత్యా వ్యాపారి. నగరంలో ఓ పని నిమిత్తం కారులో వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి ఎన్టీఆర్ నగర్ లోని ఆద్య ఆస్పత్రికి వచ్చి కారును పార్కింగ్‌ చేశాడు. భయాందోళనతో ఉన్న అతను ఆస్పత్రి నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కాగా..నగరంలో పని నిమిత్తం వెళ్లిన అతను మూసారాంబాగ్‌ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ క్రమంలో రితీష్‌రెడ్డిని బైకుపై ఇద్దరు వ్యక్తులు వెంబడించడంతో భయాందోళనకు గురయ్యాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన తనపై కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. రితీష్‌ రెడ్డి కారును ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు. 

అతను కారు ప్రమాదం చేసి వచ్చాడని అక్కడివారికి చెబుతున్న క్రమంలోనే.. రితీష్‌రెడ్డి భవనంపై నుంచి దూకడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. రితీష్‌ రెడ్డికి 8 నెలల క్రితమే వివాహమైందని, ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రితీష్‌ రెడ్డిని వెంబడించినవారి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)