Breaking News

లంచం తీసుకుంటూ పట్టుబడిన యువ ఐఏఎస్‌ అధికారి

Published on Tue, 06/10/2025 - 06:27

భవానీపట్నా/భువనేశ్వర్‌: త్రిపురలోని గ్రామీణ నేపథ్యమున్న ధీమన్‌ ఛక్మాకు గత ఆరేళ్లుగా ప్రజల్లో ఎంతో మంచిపేరుంది. రెండుసార్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) పరీక్షల్లో మెరుగైన ర్యాంక్‌లు సాధించి శెభాష్‌ అనిపించుకుని ప్రస్తుతం సబ్‌–కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఛక్మాను విజిలెన్స్‌ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా లంచం కేసులో అరెస్ట్‌చేశారు. ఒడిశాలోని ధర్మగఢ్‌ సబ్‌–కలెక్టర్‌గా ఉంటూ ఒక వ్యాపారి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. 

సోమవారం ఆయనను స్థానిక కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆదివారం కలహండీ జిల్లాలోని ఛక్మా నివాసంలో విజిలెన్సు అధికారులు రూ.47 లక్షల నగదును స్వా«దీనంచేసుకున్నారు. తనకు రూ.20 లక్షలు లంచం ఇవ్వకపోతే నీ అంతు చూస్తానని స్థానిక వ్యాపారిని సబ్‌–కలెక్టర్‌ హోదాలో ఛక్మా బెదిరించాడు. దీంతో ఆ వ్యాపారి తమను ఫిర్యాదుచేశారని విజిలెన్స్‌ ఎస్పీ ఎం.రాధాకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జప్తు చేసిన నగదు విషయంలో ఆయన ఎలాంటి సంజాయిషీ ఇవ్వకపోవడంతో అవినీతి నిరోధక(సవరణ)చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం సబ్‌–కలెక్టర్‌పై కేసు నమోదుచేసి అరెస్ట్‌చేశారు.  
ఎవరీ ఛక్మా? 
త్రిపురలోని కంచన్‌పూర్‌కు చెందిన ఈ యువ అధికారి 2019లోనే యూపీఎస్‌సీలో 722 ర్యాంక్‌ సాధించి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌)లో చేరారు. ఒడిశా కేడర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోని బరిపదలో అదనపు చీఫ్‌ కన్జర్వేటర్‌గా పనిచేశారు. రెండేళ్లకే మళ్లీ 2021లో యూపీఎస్‌సీ రాసి ఈసారి 482 ర్యాంక్‌ సాధించారు. దీంతో ఈసారి ఐఏఎస్‌ హోదా సాధించారు. శిక్షణ తర్వాత ధర్మగఢ్‌ సబ్‌–కల్టెర్‌గా పోస్ట్‌ఇవ్వడంతో అప్పటి నుంచి అ క్కడే పనిచేస్తున్నారు. రెండుసార్లు అఖిల భారత సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై అప్పట్లో ఈశాన్య రాష్ట్రాల యువతకు ఆదర్శంగా నిలిచి ఇప్పుడు అవినీతికి పాల్పడి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.   

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు